- Telugu News Photo Gallery Viral photos Indian Man Wins Rs 33 crore UAE Jackpot With Tickets Featuring Birth Dates Of His Two Children
Viral: అదృష్టం అంటే అతనిదే.. ఫ్రీ టికెట్లతో ఓవర్‌నైట్ కరోడ్‌పతి అయ్యాడు.. ఎంత వచ్చిందంటే.?
అదృష్టం అనేది మన నుదిటి రాతలో రాసి పెట్టి ఉంటే.. అది ఏ రూపంలోనైనా మనకు దక్కక మానదు. అందుకే అప్పుడప్పుడూ కొంతమంది అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతూ.. ఓవర్‌నైట్‌లోనే కోటీశ్వరులుగా మారిపోతారు. సరిగ్గా అబుదాబీలో ఉంటున్న ఈ భారతీయుడికి కూడా అదృష్టం భలేగా కలిసొచ్చింది.
Updated on: Feb 11, 2024 | 12:32 PM

అదృష్టం అనేది మన నుదిటి రాతలో రాసి పెట్టి ఉంటే.. అది ఏ రూపంలోనైనా మనకు దక్కక మానదు. అందుకే అప్పుడప్పుడూ కొంతమంది అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతూ.. ఓవర్‌నైట్‌లోనే కోటీశ్వరులుగా మారిపోతారు. సరిగ్గా అబుదాబీలో ఉంటున్న ఈ భారతీయుడికి కూడా అదృష్టం భలేగా కలిసొచ్చింది. పిల్లల పేరుతో తీసుకున్న లాటరీ టికెట్లకు.. ఆపై వచ్చిన ఫ్రీ టికెట్లతో ఏకంగా రూ. 34 కోట్లు దక్కించుకున్నాడు.

దుబాయ్‌లోని అల్ ఐన్‌లోని ఆర్కిటెక్చరల్ సంస్థలో పని చేస్తున్నాడు రాజీవ్. అతడు గడిచిన మూడేళ్ల నుంచి తన భార్య, పిల్లలపై 'బిగ్ టికెటు' లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈసారి బిగ్ టికెట్‌పై స్పెషల్ ఆఫర్ ఉండటంతో.. ఆయనకు ఆరు టికెట్లు వచ్చాయి. రెండు టికెట్లు కొంటే నాలుగింటిని ఉచితంగా పొందాడు.

తన పిల్లల పుట్టినరోజు తేదీలకు అనుగుణంగా 7, 13 నంబర్లతో ఉన్న టికెట్లు కొన్నాడు రాజీవ్. లాటరీ డేట్ రానే వచ్చింది.. ఇక ఆ అనౌన్స్‌మెంట్‌లో రాజీవ్ పేరు మారుమ్రోగింది.

మూడేళ్లలో మొదటిసారి అదృష్టం కలిసి రావడంతో పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. తమ జీవితాలను లాటరీ మార్చేసిందని రాజీవ్ పేర్కొన్నాడు.

తాను లాటరీలో గెలుచుకున్న 15 మిలియన్ల దర్హమ్‌లు మరో 19 మందితో సమానంగా పంచుకోవాలని అనుకుంటున్నానని రాజీవ్ తన ఉదార హృదయాన్ని చాటుకున్నాడు.
