Rతో పేరు మొదలయ్యే వారి వైవాహిక జీవితం ఇదే! కష్టాలు తప్పవంట!
న్యూమరాలజీ ప్రకారం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి పేరు అనేది ఆ వ్యక్తిపై అనేక ప్రభావాలను చూపిస్తుంది. ముఖ్యంగా అది ఆ వ్యక్తి స్వభావం, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని ప్రతిభింబిస్తుంది. అయితే ప్రతి ఒక్కరి పేరులో ఏదో తెలియని శక్తి దాగి ఉంటుంది. అది వారి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.
Updated on: Jun 16, 2025 | 1:56 PM

న్యూమరాలజీ ప్రకారం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి పేరు అనేది ఆ వ్యక్తిపై అనేక ప్రభావాలను చూపిస్తుంది. ముఖ్యంగా అది ఆ వ్యక్తి స్వభావం, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని ప్రతిభింబిస్తుంది. అయితే ప్రతి ఒక్కరి పేరులో ఏదో తెలియని శక్తి దాగి ఉంటుంది. అది వారి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు పేరు పెట్టే సమయంలో ఎంతో ఆలోచించి, మంచి పేరు పెడుతుంటారు. అందుకే వారి జీవితంపై సానుకూల ప్రభావం చూపే అక్షరంతో పేరు పెడుతారు. అయితే ఈ రోజు మనం Rఅనే లెటర్‌తో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం, వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రం ప్రకారం, R సంఖ్య 2 ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. సంఖ్యాశాస్త్రం సంఖ్య 2 చంద్రునిచే పాలించబడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది చిత్త నక్షత్రం కిందకు వస్తుంది, అలాగే ఇది తుల రాశిచక్రానికి చెందినది. ఈ ఆర్ లెటర్‌తో ఎవరి పేరు అయితే మొదలవుతుందో వారు ధైర్యం, మంచి అభిరుచితో పాటు, జీవితంలో ఆనందం, విలాసాలకు అధిక ప్రియారిటీ ఇస్తారంట. ముఖ్యంగా తమ జీవితాన్ని సంతృప్తిగా గడపడానికి ఎక్కువ ఇష్టపడుతారంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

అలాగే , R అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు ఆకర్షణీయమైన రూపంతో ఉంటారంట. అంతే కాకుండా వీరు ఏ విషయాన్నైనా సరే చాలా లోతుగా తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతారంట. అక్షరం R ఉన్న వ్యక్తులు అందరినీ ప్రేమిస్తారు, గౌరవిస్తారు. వారు సాధారణంగా సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు. వారు సామాజిక సేవ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తారు. ప్రపంచంలోని మంచితనాన్ని పెంచడానికి, వారు ముందుకు అడుగు వేసి, కొన్నిసార్లు చాలా సమస్యల్లో కూడా చిక్కకుంటారు.

అందుకే వీరిలో అతి మంచితనం కూడా మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. ఇక వీరి ప్రేమ విషయానికి వస్తే, వీరు చాలా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంకటారు. ప్రేమలోనూ కూడా వీరు ఎక్కువగా ప్రశాంతతను కోరుకుంటారు. ప్రేమపై మంచి నమ్మకంతో ఉంటారు. అంతే కాకుండా వీరి ధైర్యం, మంచితనం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఇక వీరు మంచి రొమాంటిక్ పర్సన్స్ లా కనిపించడం వలన తమ భాగస్వామి ఎప్పుడూ వీరితో ఆనందంగా కలిసి ఉండటానికే ఇష్టపడుతుంది.

అదే విధంగా R అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వారు తమ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచుకుంటూనే, జీవితంపై అనేక ఆశలతో కొత్త ప్రయత్నాలకు పూనుకుంటారు. ఆర్థికంగా స్థిరంగా ఉండేలా చూస్తారు.వీరు ఎక్కువగా తమ కుటుంబానికి, తన భాగస్వామికే ప్రియారిటీ ఇస్తారు. అంతే కాకుండా వీరు అతిగా ప్రేమను చూపిస్తారు. కొన్ని సార్లు ఇదే వీరి వైవాహిక జీవితంలో కలతలకు కారణం అవుతుంది. అంతే కాకుండా వీరి అతి మంచితనం కూడా సంబంధంలో సమస్యలు తీసుకొస్తుందంట. ఈ విషయంలో వీరికి కష్టాలు తప్పవంటున్నారు పండితులు.



