AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 7 కోట్ల బడ్జెట్.. 4000 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

తక్కువ బడ్జెట్‌తో సినిమా తీసి భారీ లాభాలు ఆర్జించే ఫార్ములాను కేరళ దర్శకులు ప్రవేశపెట్టారు. హాలీవుడ్ దర్శకులు వారికి గట్టి పోటీ ఇస్తున్నారు. 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఎలా హిట్టయిందో చాలా మందికి అర్థం కాదు.

Rajitha Chanti
|

Updated on: Jul 26, 2026 | 2:47 PM

Share
బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు ఏ చిన్న సినిమా అద్భుతాలు సృష్టిస్తుందో ఊహించడం చాలా కష్టం. పెద్ద స్టార్ కాస్ట్, వందల కోట్ల బడ్జెట్, భారీ విఎఫ్ఎక్స్ (VFX) హంగామా ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ ఒక చిన్న హారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదే హాలీవుడ్ ఇండిపెండెంట్ హారర్ మూవీ 'అబ్సెషన్' (Obsession).

1 / 5
కరి బాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం $7,50000 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 6 నుండి 7 కోట్లు) అత్యల్ప బడ్జెట్‌తో తెరకెక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తూ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా $250 మిలియన్లకు పైగా (సుమారు రూ. 2,000 కోట్ల నుండి రూ. 2,100 కోట్లకు పైగా) వసూలు చేసి అందరినీ విస్తుపోయేలా చేసింది.

2 / 5
కరి బాకర్ ఇదివరకు యూట్యూబ్‌లో కామెడీ-హారర్ వీడియోలతో ప్రసిద్ధి చెందారు. ఈ చిత్రంలో మైఖేల్ జాన్స్టన్, ఇండే నవరెట్ ప్రధాన పాత్రలు పోషించారు. తన బెస్ట్ ఫ్రెండ్‌ను ప్రేమలో పడేయాలనే ఒక యువకుడి ఆరాటం ఎలాంటి సైకలాజికల్ మరియు భయానక పరిణామాలకు దారితీసింది అనే కథాంశంతో, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను అందించడంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించారు.

3 / 5
ఎలాంటి భారీ ప్రమోషన్లు లేకుండా విడుదలైనప్పటికీ, సినిమా చూసిన ప్రేక్షకులు అందించిన పాజిటివ్ టాక్ ఈ చిత్రానికి ప్రధాన బలమైంది. ముఖ్యంగా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో 18 నుండి 25 సంవత్సరాల వయసున్న యువత ఈ సినిమాలోని సన్నివేశాలు, మీమ్స్, ఫ్యాన్ ఆర్ట్‌ను విపరీతంగా ట్రెండ్ చేశారు. సాధారణంగా హాలీవుడ్ హారర్ చిత్రాలకు భారత్‌లో పరిమిత ఆదరణ ఉంటుంది.

4 / 5
కానీ 'అబ్సెషన్' చిత్రం ఇండియాలో విడుదలయ్యాక కేవలం మొదటి వారంలోనే దాదాపు రూ. 18.55 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో 50% పైగా ఆక్యుపెన్సీ నమోదు చేస్తూ, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఏలాంటి భారీ స్టార్ డమ్ లేకుండా, కేవలం బలమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, సరైన నిడివితో వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'అబ్సెషన్' సినిమా మరోసారి నిరూపించింది.

5 / 5
Follow Us