- Telugu News Photo Gallery These mistakes made at night dinner can lead to rapid weight gain and health problems
Health Tips: రాత్రి భోజనం తర్వాత ఇలాంటి తప్పులు చేస్తున్నారా..? అయితే, జాగ్రత్తగా ఉండటం బెటర్.. లేకపోతే..
ఉరుకులు పరుగుల జీవితం.. పని ఒత్తిడి.. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం.. దీంతో ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ బరువు గురించి ఆందోళన చెందుతున్నారు. బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో చర్యలు తీసుకుంటాం. కానీ నేటి బిజీ లైఫ్ స్టైల్ వల్ల మన ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తరచుగా ప్రజలు ఆహారం తిన్న తర్వాత చాలా తప్పులు చేస్తారు. దీని కారణంగా వారి బరువు వేగంగా పెరుగుతుంది.
Updated on: Sep 13, 2023 | 4:08 PM

ఉరుకులు పరుగుల జీవితం.. పని ఒత్తిడి.. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం.. దీంతో ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ బరువు గురించి ఆందోళన చెందుతున్నారు. బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో చర్యలు తీసుకుంటాం. కానీ నేటి బిజీ లైఫ్ స్టైల్ వల్ల మన ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తరచుగా ప్రజలు ఆహారం తిన్న తర్వాత చాలా తప్పులు చేస్తారు. దీని కారణంగా వారి బరువు వేగంగా పెరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత కూడా ఇలాంటి తప్పులు చేస్తే బరువు పెరగడంతోపాటు.. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళ డిన్నర్ తర్వాత చేయకూడని తప్పులేంటో తెలుసుకోండి..

కాఫీ-టీ: కొందరికి టీ, కాఫీ అంటే చాలా ఇష్టం. కెఫీన్ అనే పదార్థం టీ, కాఫీలలో ఉంటుంది. చాలా మందికి రాత్రి భోజనం తర్వాత టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇది వారికి చాలా హానికరం. బరువు పెరగడానికి దారితీస్తుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది.

నేటి బిజీ లైఫ్‌లో ప్రజలు తమ పనిలో చాలా అలసిపోతారు. అలాంటి వారికి వంట చేయాలని కూడా అనిపించదు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు బయట నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు. దీనిలో ప్రజలు ఎక్కువగా జంక్ ఫుడ్, ఫ్రై పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. కానీ, రాత్రిపూట జంక్ ఫుడ్, ఫ్రై పదార్థాలు తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. దీని కారణంగా బరువు వేగంగా పెరుగుతుంది.

తరచుగా ప్రజలు రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు చాలా స్వీట్లు తింటారు. ఇది వారి బరువు పెరగడానికి కారణం అవుతుంది. అందువల్ల, రాత్రి భోజనం తర్వాత స్వీట్లను తక్కువ పరిమాణంలో తినండి. సాధ్యమైనంత మేరకు తినకుండా ఉండటమే బెటర్..

నేటి బిజీ లైఫ్‌లో తిండి తినడానికి కూడా సమయం దొరకడం లేదు. చాలా మందికి ఆలస్యంగా తినడం అలవాటయిపోతోంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఆలస్యంగా భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. ఇది వారి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా అలాంటివారిలో వేగంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది.

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆహారం తిన్న కనీసం 45 నుంచి 60 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా తాగడం అలవర్చుకోవడం మంచింది. ఇంకా ఆహారం తినే ముందుకు ఒక గ్లాసు నీరు తీసుకోవడం కూడా మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు..





























