వెండి ధరించకూడని రాశులు ఏవో తెలసా?.. ధరిస్తే కష్టనష్టాలేనంట!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు అస్సలే వెండి ధరించకూడదంట. దీని వలన అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదు అని చెబుతున్నారు పండితులు. కాగా, అసలు ఏ రాశి వారు వెండి ధరించకూడదు, ధరి స్తే ఎలాంటి చెడు ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Updated on: Jun 12, 2025 | 2:08 PM

జ్యోతిష్య శాస్త్రంలో బంగారం, వెండి లోహాలకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కో లోహం కొన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. అందుకే పండితులు కొన్ని లోహాలను పలు రాశుల వారు ధరించకూడదు అని చెబుతుంటారు. కాగా, అయితే చాలా వరకు వెండి ధరించడం చాలా శుభ ప్రదం.

ముఖ్యంగా గతంలో నాన్నమ్మలు, తాతయ్యలు ఏదో ఒక వెండి ఆభరణం చేయించి పిల్లలకు వేసే వారు. ఎందుకంటే వెండి ధరించడం వలన మంచి జరుగుతుందని వారినమ్మకం, అయితే కానీ కొన్ని రాశుల వారు మాత్రం అస్సలే వెండి ధరించకూడదు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే?

మకర రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వారు అస్సలే వెండి ఆభరణాలు ధరించకూడదంట. ఇది వారిపై చాలా వరకు నెగిటివ్ ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు పండితులు. ఇది వారి వైవాహిక జీవితం, ఆరోగ్యం, ఉద్యోగం పై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉన్నదంట. అందుకే వీలైనంత వరకు మకర రాశి వారు వెండి ఆభరణాలు ధరించకూడదంట.

వృషభ రాశి : 12 రాశుల్లో రెండో రాశి అయిన వృషభ రాశి వారు కూడా వెండి ఆభరణాలు ధరించకపోవడమే చాలా మంచిదంట. ఇది ఈ రాశి వారి జీవితాల్లో అనేక సమస్యలను తీసుకొస్తుందంట. కష్టానికి తగిన ఫలితం ఉండదంట. ఆర్థికపరమైన సమస్యలతో సతమతం కావాల్సి వస్తుందంట. అందుకే అస్సలే వృషభ రాశి వారు వెండి ధరించకూడదంట.

సింహ రాశి : సింహ రాశి వారు కూడా వెండి ఆభరణాలు ధరించకూడదు అని చెప్తున్నారు పండితులు. దీని వలన వీరు కెరీర్ పరంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అందుకే ఈ రాశి వారు సాధ్యమైనంత వరక వెండి ఆభరణాలకు దూరం ఉండాలంట.



















