- Telugu News Photo Gallery These are the precautions that people with familial hypercholesterolemia should take
మీ కుటుంబంలో అధిక కొలెస్ట్రాల్ ఉందా.. మీరు కూడా ప్రమాదంలో ఉన్నట్లే!
తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు.మరీ ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీ కుటుంబంలో ఎవ్వరికైనా సరే హై కొలెస్ట్రాల్ ఉంటే మీరు కూడా ప్రమాదంలో ఉన్నారో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, మనం దీని గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Updated on: Aug 24, 2025 | 12:00 PM

తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు.మరీ ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీ కుటుంబంలో ఎవ్వరికైనా సరే హై కొలెస్ట్రాల్ ఉంటే మీరు కూడా ప్రమాదంలో ఉన్నారో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, మనం దీని గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

కుటుంబ హైపర్ కొలెస్టెరోలేమియా (FH) అనేది చాలా చిన్న వయసు నుంచే చెడు కొలెస్ట్రాల్ కు కారణం అయ్యే తీవ్రమైన జన్యుపరమైన రుగ్మత అంట. ఇది సరైన ఆహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, వారసత్వం, జీవనశైలి మార్పల వలన వస్తుందంట. కొన్ని సార్లు బాగా తిని, చురుకుగా ఉండే వ్యక్తుల్లో కూడా ఈ సమస్య ఉంటుందంట.

అయితే సమస్యను గుర్తించి చికిత్స చేయకపోతే ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా పెంచుతుందంట. వాస్తవానికి ఎఫ్ ఎచ్ ఉన్నవారి గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ 20 రేట్లు ఎక్కువంట. 50 సంవత్సరాల వయసులో ఉన్న పురుషులు సగం మంది గుండెపోటుకు గురిఅవుతున్లు పరిశోధనలో తేలిందంట. అలాగే 60 సంవత్సరాలు ఉన్న మహిళలు 30 శాతం గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారంట. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూస్తున్నారు వైద్య నిపుణులు.

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ హైపర్ కొలెస్టెరోలేమియా ఉన్నవారిలో ఈ ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటుంది. అందు వలన జన్యపరమైన అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ప్రతి ఒక్కరూ 20 సంవత్సరాల వయసు నుంచి ప్రతి నాలుగు నుంచి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవాలంట. ముఖ్యంగా కుటుంబ చరిత్ర ఉన్న వారు, గుండె జబ్బులు ఉన్న పిల్లలకు స్క్రీనింగ్ ముందుగానే ప్రారంభించాలంట.

అలాగే ఊబకాయం, మధుమేహం ఉన్న వారు తరచుగా పరీక్షలు చేసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అంతా కాకుండా మీ కుటుంబంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లైతే ఫ్యామిలీ హైపర్ కొలెస్టెరోలేమియా వంటిది నిర్ధారణ అయితే జీవనశైలి మార్పు చేసుకోవడమే కాకుండా, ప్రతి రోజూ వ్యాయమం చేయం, మందులు వాడటం, మంచి ఆహారం తీసుకోవడం చేయాలంట.



