సూర్యాస్తమయం తర్వాత జుట్టు కట్ చేయడం ఎంత పాపమో ఇప్పుడు తెలుసుకోండి!
ఈ మధ్య చాలా మంది సూర్యాస్తమయం తర్వాత జుట్టు కట్ చేస్తున్నారు. కానీ ఇది అస్సలే మంచిది కాదని చెబుతున్నారు పండితులు. కాగా, అసలు సూర్యాస్తమయం తర్వాత జట్టు కట్ చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: Sep 13, 2025 | 9:38 PM

ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యాస్తమయం తర్వాత జుట్టు కట్ చేయడం చేయకూడదని మన పెద్దవారు, పండితులు చెబుతుంటారు. కానీ ఈ మధ్య అవన్నీ పట్టించుకోకుండా చాలా మంది సూర్యాస్తమయం తర్వాతనే జుట్టు కట్ చేస్తున్నారు. కానీ ఇలా అస్సలే జుట్టు కట్ చేసుకోకూడదంట. జానపద నమ్మకాలు, పురాణాల ప్రకారం ఇలా చేయడం చాలా అశుభం అంటున్నారు పండితులు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో, సూర్యాస్తమయం తర్వాత జుట్టు కట్ చేసుకుంటే మహా పాపం అంట. ఎందుకంటే? ఈ సమయంలో వెలుతురు పోతుంది. అలాగే రాత్రి సమయంలో దుష్టశక్తులు చాలా చురుకుగా ఉంటాయంట. దీని వలన జుట్టు కత్తిరించుకునే వారికి అశుభం జరుగుతుందని చెబుతున్నారు పండితులు.

ముఖ్యంగా సూర్యస్తమయం తర్వాత ఎవరైతే జుట్టు కత్తిరించుకుంటారో వారికి అదృష్టం కలగదంట. వారికి కలగే అదృష్టానికి కూడా ఆటంకం కలగుతుందని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా, ఆయుష్శు కూడా తగ్గుతుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయంలో జుట్టు కత్తిరించుకోకూడదని చెబుతారు మన పెద్దవారు.

అదేవిధంగా సాయంత్రం సమయంలో ఆరు దాటిన తర్వాత జుట్టు కత్తిరించుకోవడం వలన దుర దృష్టం కలగడమే కాకుండా, ప్రతి కూల శక్తి ఎక్కువగా పెరుగుతుందంట. దీని వలన కుటుంబంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక నష్టాలు, కలహాలు, ఉద్యోగంలో ఆటంకాలు ఇలా చాలా సమస్యలు ఎదురు అవుతాయంట.

అంతే కాకుండా పూర్వీకుల ఆశీర్వాదం కూడా అందందు. వారి నుంచి ఎలాంటి ఆశీర్వాదం లభించదంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



