- Telugu News Photo Gallery The color of the water bottle cap indicates the taste of the water, what does that mean
వాటర్ బాటిల్ మూత రంగు నీటి రుచిని తెలుపుతుంది..ఎలా అంటే?
వాటర్ బాటిల్స్ అనేవి ఒకే రంగులో ఉన్నప్పటికీ వాటి క్యాప్స్ మాత్రం డిఫరెంట్ రంగులో ఉంటాయి. అయితే మనం తాగే వాటర్ బాటిల్ మూత, ఆ నీటి రుచిని తెలుపుతుందంట. కాగా, వాటర్ బాటిల్ మూత నీటి రుచిని ఎలా తెలుపుతుందో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 08, 2025 | 1:47 PM

వాటర్ తాగని వారు ఎవరుంటారు చాలా మంది వాటర్ తాగుతుంటారు. ఇక ప్రయాణ సమయంలో తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొనుగోలు చేసి వాటర్ తాగుతారు. ఇక ఈ వాటర్ బాటిల్స్ లో అనేక రకాలు ఉంటాయి. కొన్ని బ్రాండ్ పేరుతో మరికొన్ని నార్మల్‌గా ఉంటాయి. ఎవరికి నచ్చింది వారు కొనుగోలు చేస్తారు. యితే మనం కొనుగోలు చేసి తాగే వాటర్ బాటిల్ రంగు మూతలు ఒక్కో కలర్‌లో ఉంటాయ. అయితే ఆ కలర్స్ నీటి రుచిని తెలుపుతాయంట. అది ఎలా అంటే?

వాటర్ బాటిల్ మూత నీలం రంగులో ఉంటే, ఆ సీసాలోని నీరు శుద్ధి చేయబడిందని అర్థం. దీనిలోని నీరు చాలా తియ్యగా , టేస్టీగా ఉంటాయంట. అలాగే వాటర్ బాటిల్ మూత ఆకుపచ్చగా ఉంటే, ఆ నీటిలో ఫ్లేవర్ వేసి శుద్ధి చేశారని అర్థం. ఇవి కాస్త తియ్యగా, ఉప్పగా ఉంటాయంట.

వాటర్ బాటిల్ మూత తెలుపు రంగులో ఉంటే ఆ నీరు ప్రాసెస్ చేసిన నీరు అంట. అంటే ఆ నీటిని ప్రాసెస్ చేసి, మార్కెట్‌లోకి తీసుకురావడం జరిగిందని అర్థం. ఆ నీరు కాస్త తియ్యగా ఉంటాయి.

ఇక బాటిల్ మూతర రంగు నల్లగా లేదా, గోధుమ రంగులో ఉంటే ఆ నీరు క్షారంగా ఉంటాయి. అంటే ఈ మంచి నీరు తాగుతుంటే కాస్త చేదుగా ఉంటాయంట.

నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ఇది కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రమే ఇవ్వబడినది.



