- Telugu News Photo Gallery Technology photos Xiaomi launches new smart fan Xiaomi smart standing fan 2 features and price
Xiaomi Smart Fan: షావోమి నుంచి స్మార్ట్ ఫ్యాన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
xiaomi smart standing fan 2: వరుసగా స్మార్ట్ హోం ప్రొడక్ట్స్‌ను విడుదల చేస్తూ వస్తోన్న షావోమీ తాజాగా స్మార్ట్ ఫ్యాన్‌ను విడుదల చేసింది. షావోమీ స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫ్యాన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ఈ ఫ్యాన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Updated on: Jul 12, 2022 | 5:43 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా కొత్త స్మార్ట్ ఫ్యాన్‌ను లాంచ్ చేసింది. షావోమి స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2 పేరుతో తీసుకొచ్చారు. పేరుకు తగ్గట్లుగానే ఈ ఫ్యాన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు.

ఈ స్మార్ట్ ఫ్యాన్ అమెజాన్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 100 స్పీడ్ లెవల్స్‌తోపాటు త్రీ-డైమెన్షల్ ఎయిర్ ఫ్లోలు అందించారు. డ్యూయల్ డిజైన్‌తో బిఎల్‌డీసీ ఇన్వర్టర్ కాపర్ వైర్ మోటార్ ఈ ఫ్యాన్ ప్రత్యేకత.

సాధారణంగా అల్యూమినియం మోటార్‌తో పోలిస్తే కాపర్ మోటర్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఫ్యాన్‌ను యాప్ సహాయంతో కంట్రోల్ చేసుకోవచ్చు.

55.8 డెబిబుల్ నాయిస్ లెవల్ ఎయిర్‌ఫ్లోను అందిస్తుంది. దీంతో అస్సలు ఫ్యాన్ ఆన్‌లో ఉందా లేదా అన్న భావన కలుగుతుంది. ఫ్యాన్‌లోని 100 స్పీడ్ లెవల్స్‌ను యాప్ ద్వారా మార్చుకోవచ్చు.

ధర విషయానికొస్తే ఈ ఫ్యాన్ ధర రూ. 9,999గా ఉంది. అయితే సేల్‌లో భాగంగా రూ. 5,999కే అందిస్తున్నారు. జులై 19 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్న ఈ స్మార్ట్ ఫ్యాన్‌ను షావోమి అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.




