- Telugu News Photo Gallery Technology photos Whatsapp introducing new feature undo delete for me feature, Check here for full details
Whatsapp: ‘డిలీట్ ఫర్ ఆల్’కు బదులు.. ‘డిలీట్ ఫర్ మీ’ నొక్కారా.?
రోజురోజుకీ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఎన్నిరకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చినా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ తగ్గకపోవడానికి ఇందులోని ఫీచర్లే కారణంగా చెప్పొచ్చు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది..
Updated on: May 18, 2024 | 10:43 AM

యూజర్ల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాట్సాప్ తీసుకొచ్చిన ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌లో 'డిలీట్ ఫర్ ఆల్' అనే ఫీచర్ ఒకటి. పొరపాటు ఎవరికైనా తప్పుడు మెసేజ్ పంపిస్తే డిలీట్ చేసేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.


వాట్సాప్ త్వరలోనే 'అన్ డూ డిలీట్ ఫర్ మీ' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో డిలీట్ ఫర్ మీ చేసిన మెసేజ్ ను అన్ డూ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే. మీరు డిలీట్ ఫర్ మీ క్లిక్ చేయగానే.. అన్ డూ డిలీట్ ఫర్ మీ ఆప్షన్ కనిపిస్తుంది.

ఆ ఆప్షన్‌ను క్లిక్ చేయగానే మీరు డిలీట్ చేసిన మెసేజ్ మళ్లీ రీస్టోర్ అవుతుంది. దీంతో మళ్లీ డిలీట్ ఫర్ ఆల్ నొక్కితో సరిపోతుంది. అయితే ఈ అన్‌డూ ఆప్షన్ కేవలం 5 సెకన్లు మాత్రమే ఉంటుంది.



















