Itel Unicorn Pendant: స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌

మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీలోనూ మార్పులు వస్తున్నాయి. కొంగొత్త గ్యాడ్జెట్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఇక స్మార్ట్ వాచ్‌లకు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్‌ వాచ్‌లలో సరికొత్త ఫీచర్లను జోడిస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఐటెల్ మార్కెట్లోకి కొత్త గ్యాడ్జెట్‌ను లాంచ్‌ చేసింది..

Narender Vaitla

|

Updated on: May 18, 2024 | 11:05 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఐటెల్ మార్కెట్లోకి కొత్త రకం స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. ఐటెల్ యూనికార్న్ పెండెంట్ పేరుతో తీసుకొచ్చిన ఈ గ్యాడ్జెట్ స్మార్ట్ వాచ్ లా మాత్రమే కాకుండా ఒక లాకెట్ లా పనిచేస్తుంది. ఫ్యాషనబుల్ గ్యాడ్జెట్ గా దీనిని రూపొందించారు. ఇంతకీ స్మార్ట్ వాచ్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌లో నావిగేషన్‌ ఓకసం స్పోర్ట్స్ మోడ్ బటన్, డైనమిక్ క్రౌన్, స్విచ్ బటన్‌ను అందించారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు.

2 / 5
Itelఇక ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 7 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుందని, 15 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ వాచ్‌ కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జ్‌ కావడం విశేషం.

3 / 5
ఇందులో 100కిపైగా స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు ఫిమేల్ సైకిల్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి హెల్త్‌ ఫీచర్లను అందించారు. డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తే ఈ వాచ్‌లో ఏఐ వాయిస్‌ అసిస్టెంట్ ఫీచర్‌ను అందించారు.

4 / 5
ఎస్‌పీఓ2, 24×7 హార్ట్‌ రేట్, స్ట్రెస్‌ మానిటర్‌ వంటి ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ను ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందించారు. నేటి నుంచి (మే 18వ తేదీ) సేల్స్ ప్రారంభంకానున్నాయి. ధర విషయానికొస్తే రూ. 2899గా నిర్ణయించారు.

5 / 5
Follow us