Vivo X100: వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌.. స్టన్నింగ్ డిజైన్‌తో..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో ఇటీవల మార్కెట్లోకి వరుసగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వివో ఎక్స్‌ 100 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: May 07, 2024 | 9:04 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ వివో చైనా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. వివో ఎక్స్‌ 100 సిరీస్‌ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో ఫోన్‌లను తీసుకొస్తున్నాయి.

1 / 5
వచ్చే వారంలో తొలుత చైనా మార్కెట్లోకి లాంచ్‌ కానున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో ఎప్పుడు తీసుకొస్తారన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఇప్పటికే చైనాలో ఈ ఫోన్‌లకు సంబంధించిన ప్రీ-రిజర్వేషన్లు ప్రారంభం అయ్యాయి. వీటిలో 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్‌ వేరియంట్స్‌తో తీసుకురానున్నారు.

2 / 5
మే 13వ తేదీన ఈ ఫోన్‌లను లాంచ్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకనట చేయలేదు. అయితే నెట్టింట కొన్ని ఫీచర్లు, ఆప్షన్స్‌ లీక్‌ అయ్యాయి. వాటి ప్రకారం ఈ ఫోన్‌ ధర ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం.

3 / 5
వివో ఎక్స్100 అల్ట్రా, ఎక్స్100ఎస్ ప్రో ఫోన్లను స్పేస్ గ్రే, టైటానియం, వైట్ మూన్‌లైట్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్స్‌లో జీస్ బ్రాండెడ్ కెమెరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. తొలి సేల్‌ మే 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

4 / 5
ఇక ధర విషయానికొస్తే వివో ఎక్స్100 అల్ట్రా ధర మన కరెన్సీలో రూ. 77,500కాగా, వివో ఎక్స్100ఎస్ ధర సుమారు రూ.46,200, వివో ఎక్స్100ఎస్ ప్రో రూ.57,000 నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.

5 / 5
Follow us