- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discount on smart tv Under 10k price
Smart TV: కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో స్మార్ట్ టీవీలు..
ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ కచ్చితంగా స్మార్ట్ టీవీలు ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, ప్రతీ ఇంట్లో వైఫై అందుబాటులోకి రావడంతో చాలా మంది స్మార్ట్ టీవీలను కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్ టీవీలు కూడా అందుబాటులో లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ టీవీలపై ఓ లుక్కేయండి..
Updated on: May 07, 2024 | 8:59 PM

Acer 80 cm (32 inches): ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం అసర్‌కు చెందిన ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 20,999కాగా ఏకంగా 48 శాతం డిస్కౌంట్‌తో రూ. 10,990కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 32 ఇంచెస్ స్క్రీన్‌ను ఇచ్చారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ, హెచ్‌డీఎమ్‌ఐకి సపోర్ట్ చేస్తుంది.

Compaq 80 cm: కంపాక్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 21,999కాగా సేల్‌లో భాగంగా ర. 9,099కి సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 32 ఇంచెస్‌తో కూడిన ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 720 పిక్సెల్ రిజల్యూషన్, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. ఇందులో వైఫై, యూఎస్‌బీ, ఈథర్‌నెట్, హెచ్‌డీఎమ్‌ఐ వంటి ఫీచర్లను అందించారు.

Intex 80cm: ఇంటెక్స్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 24,999కాగా ఏకంగా 60 శాతం డిస్కౌంట్‌తో రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 720పి రిజల్యూషన్, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.

Karbonn 80 cm: ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ సంస్థ కార్బన్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 21,490 కాగా సేల్‌లో భాగంగా రూ. 8,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో వైడ్ వ్యూయింగ్ యాంగిల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి డిస్‌ప్లే ఫీచర్లను అందించారు. అలాగే ఇందులో 20 వాట్స్ ఆడియో అవుట్పుట్‌ను అందించారు.

Kodak 80 cm (32 inches) Special Edition Series HD: కోడాక్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 14,999కాగా 43 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 8,499కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 32 ఇంచెస్‌తో కూడిన ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 720 పీ రిజల్యూషన్ అందించారు




