AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo Y200e: లాంచింగ్‌కు సిద్ధమైన వివో కొత్త ఫోన్‌.. తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్స్‌

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో ఇటీవల వరుసగా కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను తీసుకొస్తున్న వివో తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వివో వై200ఈ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇంతకి ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Feb 19, 2024 | 10:02 AM

Share
 చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. వివో వై200ఈ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఫిబ్రవరి 22వ తేదీన ఇండియాలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

1 / 5
Y200కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ వస్తోంది. ఈ ఫోన్‌ను బ్లూ, ఆరెంజ్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభించనున్నట్లు తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు.

2 / 5
రిఫ్రెష్ రేట్ 120Hz, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 Gen 2 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ద్వారా ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 20 వేలలోపు అందుబాటులో ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే 2-మెగాపిక్సెల్‌తో కూడిన సెకండరీ కెమెరాను అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు.

4 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 44W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్ 6జీబీ, 8జీబీ ర్యామ్‌ ఆప్షన్లతో పాటు 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌ను లాక్/అన్‌లాక్ చేయడానికి ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను డిస్‌ప్లేలో అందించారు.

5 / 5