- Telugu News Photo Gallery Technology photos Vivo launches new smart phone Vivo v30 features and price details
Vivo v30: వివో నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్స్‌ను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తొంది. వివో వి30 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Feb 06, 2024 | 10:38 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వీ 30 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ లాంచ్ చేయనున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 12 జీబీ ర్యామ్‌తో రానుంది. ఇక ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 3డీ కర్వ్డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, నోబుల్ బ్లాక్, వేవింగ్ ఆక్వా కలర్స్‌లో తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6,78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌ను అందించారు.

డీసీఐ-పీ3 కలర్ ఆప్షన్ 100 శాతం కవరేజీతో పాటు 2800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఈ ఫోన్ అందిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ +128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.

కెమెరా విషయానికొస్తే వివో వి30 స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ ఆరా లైట్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. 50ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ట్రెయిట్ సెన్సార్‌తో కూడిన 50ఎంపీ ఓమ్నివిజన్ ఓవీ50ఈ సెన్సార్‌ను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.




