- Telugu News Photo Gallery Technology photos Instagram introduced message edit feature check here for full details
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. పొరపాటున పంపిన మెసేజ్‌లను
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ, లేటెస్ట్ అప్‌డేట్స్‌తో ఆకట్టుకునే ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ఏంటి.? దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 06, 2024 | 10:57 PM

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంతటి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత అభిరుచులకు అనుగుణంగా ఫీచర్లను తీసుకురావడం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది.

సోషల్ మీడియా రంగంలో ఎంతటి పోటీ ఉన్నా ఇన్‌స్టాగ్రామ్ తట్టుకొని నిలబడడానికి ఇదే కారణమని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను ఇప్పుడు ఇన్‌స్టాలో కూడా ప్రవేశపెట్టారు.

మనం పొరపాట్లతో ఎవరికైనా మెసేజ్‌ను పంపిస్తే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ వాట్సాప్‌లో ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి ఫీచర్‌నే తీసుకొచ్చారు.

మెసేజ్‌లు పంపిన 15 నిమిషాల్లోగా వాటిని ఎడిట్ చేసుకునే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. టైపింగ్ ఎర్రర్ వంటివి ఉంటే.. వాటిని అన్‌సెండింగ్ చేయకుండానే ఎడిట్ చేసుకునే సౌలభ్యం కలగనుంది. మెసేజ్ ఎడిటింగ్ కోసం ఇన్‌స్టా యాప్‌ను ఓపెన్ చేసి కాన్వర్సేషన్‌లో మీరు ఇటీవల పంపిన మెసేజ్‌ను లొకేట్ చేయాలి.

ఆ తర్వాత మెసేజ్‌ను ప్రెస్ చేసి హోల్డ్ చేసి కనిపించే ఆప్షన్స్ నుంచి ఎడిట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీరు మార్చాలనుకుంటున్న టెక్ట్స్‌ను మార్చేస్తే సరిపోతుంది. మార్పులు చేసిన తర్వాత చాట్‌లో మీ మెసేజ్‌ను అప్‌డేట్ చేసేందుకు సెండ్‌ను ట్యాప్ చేయాలి.




