- Telugu News Photo Gallery Technology photos 4 Amazing Benefits Of Nitrogen Inflating Car Tires How Much Does Inflating Charge
Car Tires: కారు టైర్లలో సాధారణ గాలికంటే నైట్రోజన్ గాలితో ప్రయోజనాలు ఏంటి?
సాధారణ గాలితో పోలిస్తే, నైట్రోజన్ గాలిని నింపడం వల్ల కారు టైర్ల జీవితకాలం పెరుగుతుంది. సాధారణ గాలితో పోలిస్తే ఈ నైట్రోజన్ గాలి నింపడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి టైర్ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంటే, ఈ గాలి ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు వాహనం మైలేజీని పెంచుకోవాలనుకుంటే టైర్లే కాకుండా నైట్రోజన్ గాలి కూడా కీలక పాత్ర పోషిస్తుందని..
Updated on: Feb 07, 2024 | 12:01 PM

పెట్రోల్ పంపులో ఇంధనం నింపిన తర్వాత పంపు వద్ద అమర్చిన నైట్రోజన్ గ్యాస్ మిషన్‌ను మీరు ఎప్పుడైనా చూశారా? ఇప్పటి వరకు మనం కారు టైర్లలో సాధారణ గాలితో నింపుతున్నామని, అప్పుడు టైర్లలో నైట్రోజన్ గాలిని నింపాల్సిన అవసరం ఏముందని మీరు కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. సాధారణ గాలితో పోలిస్తే కారు టైర్లలో నైట్రోజన్ గాలి ఐదు ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి తెలుసుకోవాలి.

టైర్లకు నైట్రోజన్ గాలిని నింపడం వల్ల టైర్ల జీవితకాలం పెరుగుతుంది. అంతేకాదు వాహనానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. మరి సాధారణ గాలి కంటే నైట్రోజన్ వాయువు టైర్లకు ఎందుకు మేలు చేస్తుందో తెలుసుకుందాం?

సాధారణ గాలితో పోలిస్తే, నైట్రోజన్ గాలిని నింపడం వల్ల కారు టైర్ల జీవితకాలం పెరుగుతుంది. సాధారణ గాలితో పోలిస్తే ఈ నైట్రోజన్ గాలి నింపడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి టైర్ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంటే, ఈ గాలి ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

మీరు వాహనం మైలేజీని పెంచుకోవాలనుకుంటే నాణ్యమైన టైర్లే కాకుండా నైట్రోజన్ గాలి మంచిది. సాధారణ గాలి వల్ల టైర్ త్వరగా డీఫ్లేట్ అవుతుంది. టైర్‌లోని గాలి పీడనం తగ్గుతుంది. ఇది టైర్‌పై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వలన కారు మునుపటి కంటే తక్కువ మైలేజీని ఇస్తుంది. అలాగే నైట్రోజన్ గాలి ఈ సమస్యను అధిగమించి మైలేజీని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

టైర్‌లో అధిక వేడి ఉత్పన్నమైతే, కారు టైర్లు పగిలిపోయే అవకాశాలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించడం వల్ల టైర్‌లోని టెంపరేచర్‌ని మెయింటెయిన్ చేసి టైర్లు పగిలిపోయే అవకాశం ఉండదు.

పెట్రోల్ పంపుల వద్ద మీరు సాధారణ గాలిని ఉచితంగా ఎక్కిస్తుంటారు. కానీ మీరు నైట్రోజన్ గాలి కోసం కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. టైర్‌లో నైట్రోజన్ గాలి నింపితే ఒక్కో టైరుకు 20 రూపాయలు తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో రూ.10 మాత్రమే తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఛార్జీలలో తేడాలు ఉండవచ్చని గుర్తించుకోండి.




