- Telugu News Photo Gallery Technology photos These are the smart TVs that make the home more beautiful, Bumper offer in Amazon sale, Amazon great Indian festival sale details in telugu
Amazon great indian festival sale: ఇంటికి మరింత అందాన్నిచ్చే స్మార్ట్ టీవీలు ఇవే.. అమెజాన్ సేల్‌లో బంపర్ ఆఫర్
అందమైన ఇంటికి మరింత అందాన్ని తీసుకువచ్చే వస్తువులతో టీవీలు అత్యంత ముఖ్యమైనవి. లేటెస్ట్ ఫీచర్లు కలిగిన అనేక బ్రాండ్లు నేడు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక టెక్నాలజీ, ప్రత్యేకతలు, స్మార్ట్ లుక్ కలిగిన టీవీలు మార్కెట్ ను శాసిస్తున్నాయి. వాటినే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అత్యంత తగ్గింపు ధరలో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా ప్రముఖ బ్రాండ్లవి కావడం విశేషం. కొత్తగా టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఈ నేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీలు ఇవే.
Updated on: Oct 09, 2024 | 7:00 PM

ఎల్ జీ స్మార్ట్ టీవీ అత్యుత్తమ ఫీచర్లు కలిగిన టీవీని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. అమెజాన్ లో అత్యధిక రేటింగ్ పొందిన టీవీ ఇది. ప్రతి సన్నివేశాన్ని అత్యద్భుతంగా కనిపించేలా చేస్తుంది. దీనిలోని స్పీకర్ల ద్వారా డాల్బీ ఆడియోను ఆస్వాదించవచ్చు. ఇంటిలోనే మంచి సౌండ్ క్వాలిటీతో కార్యక్రమాలను వీక్షించే అవకాశం కలుగుతుంది. 32 అంగుళాల ఎల్ జీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ లో కేవలం రూ.12,990కి అందుబాటులో ఉంది.

సామ్సంగ్ స్మార్ట్ లెడ్ టీవీ ప్యూర్ కలర్ టెక్నాలజీతో ప్రతి చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ రకాల రంగులను చాలా బాగా చూడవచ్చు. డాల్బీ డిజిటల్ ప్లస్ పవర్డ్ స్పీకర్ల సాయంతో థియేటర్ లో సౌండ్ అనుభూతి పొందవచ్చు. దీనిలోని ఫిల్మ్ మోడ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 43 అంగుళాల సామ్సంగ్ స్మార్ట్ లెడ్ టీవీ అమెజాన్ సేల్ లో రూ.24,990కి అందుబాటులో ఉంది.

ఎల్ జీ స్మార్ట్ లెడ్ టీవీ సినిమాలు చూడడానికి, గేమింగ్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది దీనిలో 4కే హెచ్ డీఆర్ 10 ప్రో డిస్ ప్లే కారణంగా ప్రతి చిత్రంలోనూ స్పష్టత కనిపిస్తుంది. దీనిలోని 4కే జెన్ 6 ఆధారితమైన ఏకే ఏఐ ప్రాసెసర్ తో చలన చిత్రాలు, టీవీ కార్యక్రమాలు, క్రీడలను చాలా బాగా ఆస్వాదించవచ్చు. ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీకి అత్యుత్తమ రేటింగ్ కూడా ఉంది. అమెజాన్ సేల్ లో ఈ టీవీని రూ.29,990కి కొనుగోలు చేసుకోవచ్చు.

ఎంఐ ఎక్స్ సిరీస్ 4కె లెడ్ 43 అంగుళాల టీవీలో శక్తివంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా పనితీరు చాలా చక్కగా ఉంటుంది. హెచ్ డీఆర్ 10, డాల్పీ విజన్ సమ్మేళనంతో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాయిస్ కమాండ్ సాయంతో టీవీని చాలా సులభంగా నియంత్రించవచ్చు. అమెజాన్ సేల్ లో ఈ టీవీని రూ.25,999కి కొనుగోలు చేయవచ్చు.

సోనీ బ్రావియా స్మార్ట్ లెడ్ గూగుల్ టీవీలోని ఎక్స్ వన్ 4కే ప్రాసెసర్ తో పిక్చర్ చాలా స్పష్టంగా, కాంతివంతంగా ఉంటుంది. మంచి వీక్షణ అనుభవాన్ని మెరుగుపర్చడంతో పాటు అదనపు శబ్దాన్ని తగ్గిస్తుంది. సున్నితమైన గేమింగ్ అనుభవం కలిగిస్తుంది. హెడ్ ఫోన్, ఈయర్ ఫోన్లను కనెక్ట్ చేయడానికి బ్లూటూత్ కనెక్టివీటి కూాడా ఉంది. 55 అంగుళాల సోనీ బ్రావియా స్మార్ట్ లెడ్ గూగుల్ టీవీ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 45 శాతం డిస్కౌంట్ ను అందజేస్తున్నారు. రూ.54,990కి ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.




