కిచెన్ స్విచ్ బోర్డ్ లేదా ఇంట్లోని ఇతర భాగాలను శుభ్రం చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. శుభ్రపరిచే ముందు, ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, పవర్ ఆఫ్ చేయండి. ఈ విషయాన్ని ఇంట్లోని ఇతర సభ్యులకు తెలియజేయండి. దీనివల్ల తెలిసి తెలియక స్విచ్ బోర్డు తడిసిపోయినా కరెంట్ షాక్ కు గురయ్యే ప్రమాదం ఉండదు. అదే సమయంలో స్విచ్ బోర్డ్‌ను శుభ్రపరిచిన తర్వాత అది పూర్తిగా ఆరిపోయే వరకు దాన్ని ఆన్ చేయకూడదు. ఇలా చేస్తున్నప్పుడు మీ పాదాలకు పొడి రబ్బరు చెప్పులు ధరించడం మర్చిపోవద్దు.