- Telugu News Photo Gallery Technology photos Samsung launching new smart phone Samsung Galaxy S24 FE features and price details
Galaxy S24 FE: సామ్‌సంగ్ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే..
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్న సామ్‌సంగ్ తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్24 ఎఫ్‌ఈ పేరుతో ఈ ఫోన్‌ను ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు...
Updated on: Mar 03, 2024 | 8:22 PM

దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్24 ఎఫ్‌ఈ పేరుతో కొత్త ఫోన్‌ను ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్24 ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ ఎక్స్ నోస్ 2400 ఎస్వోసీ లేదా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ ప్రాసెస్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఫోన్‌లో 6.1 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 12 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ వేరియంట్ / 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌తో వస్తుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కాగా సామ్‌సంగ్ గతేడాది తీసుకొచ్చిన గ్యాలకసీ ఎస్23 ఎఫ్‌ఈకి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ ఫోన్‌లో 6.4 ఇంచెష్తో కూడిన స్క్రీన్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ గా లాంచ్ చేశారు.





























