- Telugu News Photo Gallery Technology photos Samsung launches budget smartphone Samsung Galaxy F05 sale starts from september 20th
Samsung Galaxy F05: రూ. 8వేలకే సామ్‌సంగ్ ఫోన్.. సేల్ ఎప్పటి నుంచంటే..
బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కంపెనీలు కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఓ వైపు చైనాకు చెందిన దిగ్గజ సంస్థలు ఫోన్‌లు చేస్తుండగా మరోవైపు సామ్‌సంగ్ వంటి కంపెనీలు సైతం బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్05 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు...
Updated on: Sep 19, 2024 | 1:57 PM

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్05 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. మంగళవారం భారత మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఇవ్వనున్నారు.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్05 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్డీ+ స్క్రీన్‌ను అందించారు. ఇక ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లో ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లో తీసుకొచ్చారు.

కెమెరా పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ర్యామ్‌ను అదనంగా మరో 4జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 5 ఓఎస్ వర్షన్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీని అందించారు. ఇక గ్యాలక్సీ ఎఫ్ 05 ఫోన్‌లో సెక్యూరిటీ కోసం ఇందులో ఫేస్ అన్ లాక్ ఫీచర్‌ను అందించారు.




