- Telugu News Photo Gallery Technology photos Redmi Note 13 Pro launched in new color variant olive green, Check here for features and price details
Redmi Note 13 Pro: సరికొత్త కలర్‌లో రెడ్‌మీ నోట్ 13 ప్రో.. ధర కూడా తక్కువే..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ కలర్స్‌కు యూజర్లు పెద్ద పీట వేస్తున్నారు. నచ్చిన కలర్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆశిస్తున్నారు. దీంతో వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగానే కంపెనీలు సైతం రకరకాల కలర్స్‌లో ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ నోట్ 13 ప్రో ఫోన్‌ను కొత్త కలర్ వేరియంట్‌లో తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 22, 2024 | 10:25 AM

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ గత జనవరిలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్‌ను అరోరా పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ టీల్ కలర్స్‌లో తీసుకొచ్చారు. అయితే తాజాగా ఆలీవ్ గ్రీన్ కలర్‌లో కూడా లాంచ్ చేశారు.

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త కలర్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999కాగా, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 26,999, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999కి లభిస్తోంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన 1.5 కే రిజల్యూషన్ కర్వ్డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఈ స్క్రీన్ సొంతం.

ఇక ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఎంఐయూఐ 14 ఓఎస్‌ను అందించారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)కు సపోర్ట్ చేసే 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 67 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే కనెక్టివిటీ కోసం 5జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూ టూత్ 5.2, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను ఇచ్చారు. ఐపీ54 రేటింగ్‌తో కూడిన డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు.




