- Telugu News Photo Gallery Technology photos Redmi launches premium smart tv with 100 inch screen have a look on features and price of Redmi Max 4K TV
Redmi Max 4K TV: రెడ్‌మీ నుంచి ప్రీమియమ్ స్మార్ట్ టీవీ.. ధర రూ. రెండున్నర లక్షలు.. ఫీచర్లు అదుర్స్..
Redmi Max 4K TV: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం రెడ్‌మీ తాజాగా చైనా మార్కెట్లో తన ప్రీమియం స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. 100 ఇంచెస్‌తో అత్యాధునిక ఫీచర్లతో రానున్న ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం చైనాలో విడుదలైనంది..
Updated on: Mar 20, 2022 | 4:51 PM

ఇప్పటి వరకు బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీలను విడుదల చేస్తూ వస్తోన్న రెడ్‌మీ తాజాగా ప్రీమియమ్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. రెడ్‌మీ మ్యాక్స్ 100 ఇంచెస్ 4కే ఎల్‌ఈడీ టీవీని చైనాలో లాంచ్ చేసింది. తర్వాలోనే భారత్‌లో విడుదల చేయనున్నారు.

ఈ స్మార్ట్ టీవీలో 120 హెడ్జ్ రిఫ్రెషర్ రేట్‌తో కూడిన 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్ 10+, ఆటో లో లాటెన్సీ మోడ్‌కు సపోర్టు చేస్తుంది. 30 వాట్ల స్పీకర్లతో వస్తుండగా డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది.

రెడ్‌మీ మ్యాక్స్ టీవీ కోర్‌టెక్స్ ఏ-73 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ టీవీ సొంతం. ఇందులో డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ ఆటామ్స్ సపోర్ట్ చేసే 30 వాట్ల స్పీకర్‌ను అందించారు.

ఇక కనెన్టివిటీ విషయానికొస్తే వైఫై 6, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఓ ఎథెర్‌నెట్ పోర్టు కనెక్టివిటీ ఆప్షన్ ఇచ్చారు.

ఇక ఈ 100 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర విషయానికొస్తే చైనాలో 19,900 యువాన్లుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 2,39,500గా ఉంది. ఏప్రిల్ 6 నుంచి చైనాలో అందుబాటులోకి రానున్న ఈ టీవీని భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది.





























