Redmi Note 14 5G: మార్కెట్లోకి రెడ్‌మీ బడ్జెట్ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌..

పండగ సీజన్‌ను టార్గెట్ చేసుకొని మార్కెట్లోకి కొంగొత్త స్మార్ట్‌ ఫోన్స్‌ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌ కార్ట్, అమెజాన్‌ సేల్స్‌లో భాగంగా మార్కెట్లోకి కొత్త ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిందే రెడ్‌మీ నోట్‌ 14 5జీ ఫోన్‌. ప్రస్తుతం చైనా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Sep 28, 2024 | 1:08 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ నోట్‌ 14 5జీ పేరుతో చైనా మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. రెడ్‌మీనోట్‌ 14 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్‌ 14 ప్రో+, రెడ్‌మీ నోట్ ప్రో 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేశారు.

1 / 5
 ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావోమీ హైపర్‌ ఓఎస్‌ ఔటాఫ్‌ బాక్స్‌ వర్షన్‌పై పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెన్‌ను ఇందులో అందించారు.

2 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5110 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను అందించారు.

3 / 5
కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్‌, ఫాంటం బ్లూ, స్టార్‌ వైట్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు.

4 / 5
ధర విషయానికొస్తే రెడ్‌మీనోట్‌ 14 5జీ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.14,300, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.16,700, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.17,900, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.20,300గా నిర్ణయించారు.

5 / 5
Follow us