- Telugu News Photo Gallery Technology photos Realme launching new smartphone Realme 12 pro and realme 12 pro plus features and price details
Realme 12 Pro: రియల్‌మీ నుంచి రెండు స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ తాజాగా కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12 ప్రో+ను త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Jan 14, 2024 | 11:04 PM

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్‌మీ 12 ప్రో సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది.

ఇందులో భాగంగా రియల్‌మీ 12 ప్రో తో పాటు, రియల్‌మీ 12 ప్రో+ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు ఫోన్‌లను రియల్‌మీ ఈ నెలలలో భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ రెండు ఫోన్స్‌లోనూ.. కర్వ్‌డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో యూఐ5 వర్షన్‌పై ఔటాఫ్ బాక్స్‌ను అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. రియల్ మీ 12 ప్రో+లో 64 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరా, 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, ఆరెంజ్, క్రీమ్ కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది.

ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 చిప్ సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీని అందించనున్నారు.




