- Telugu News Photo Gallery Technology photos Realme launches new tab in india Realme Pad 2 Lite features and price details
Realme Pad 2 Lite: రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో స్టన్నింగ్ ఫీచర్స్
స్మార్ట్ ఫోన్‌లతో సమానంగా ట్యాబ్‌కు సైతం ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ట్యాబ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ ప్యాడ్ 2 లైట్ పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 14, 2024 | 9:25 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ ప్యాడ్ 2 లైట్ పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. ఈ ప్యాడ్‌ను తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో తీసుకొచ్చారు.

రియల్‌మీ ప్యాడ్ 2 లైట్ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 830 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీతో కూడిన పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే ఈ ట్యాబ్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 15 వేల లోపు లభిస్తుంది.

ఇక ఈ ట్యాబ్‌లో 10.5 ఇంచెస్‌తో కూడిన 2కే ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్, 1920 x 1200 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ ప్యాడ్ 2 లైట్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇక ఈ ట్యాబ్ 8 GB LPDDR4X RAMతో వస్తుంది. 128 జీబీ స్టోరేజ్ ఈ ట్యాబ్ సొంతం ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ప్యాడ్ పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, 5 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 15 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 8300 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఇక ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ. 14,999, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర ర. 16,999గా ఉంది.




