- Telugu News Photo Gallery Technology photos Philips Launches New Smartphone Philips PH1 Have a look on features and price
Philips PH1: స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి ఫిలిప్స్.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో పీహెచ్1 ఫోన్..
Philips PH1: ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఫిలిప్స్ తాజాగా స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. పీహెచ్1 పేరుతో చైనా మార్కెట్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Dec 21, 2021 | 9:56 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ ఫిలిప్స్ తాజాగా స్మార్ట్ ఫోన్ తయారీలోకి అడుగుపెట్టింది. ఫిలిప్స్ పీహెచ్1 పేరుతో చైనా మార్కెట్‌లో ఫోన్‌ను లాంచ్ చేసింది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 12nm యూనిసోక్ టైగర్ టీ310 చిప్‌సెట్‌ను ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4700 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

4 జీబీ ర్యామ్+32 జీబీ, 64 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ అనే వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 4G VoLTEతో కూడిన డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ అందించారు.

ఇక ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ప్రారంభ వేరియంట్ధర కేవలం రూ. 6,000, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,140గా ఉండనున్నాయి.

ఈ ఫోన్‌లో 15 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను ఇచ్చారు. మరి చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.





























