Oneplus Sale: దీపావళికి వన్‌ప్లస్‌ డబుల్‌ బొనాంజా.. స్మార్ట్‌ ఫోన్స్‌, టీవీలపై భారీ డిస్కౌంట్‌లు. పూర్తి వివరాలు..

Oneplus Sale: చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ దీపావళి కానుకగా భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ టీవీలతో పాటు, స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది..

Narender Vaitla

|

Updated on: Oct 03, 2021 | 7:38 AM

పండుగలు వస్తున్నాయంటేనే సహజంగా ఆఫర్లు వెల్లువెత్తుతుంటాయి. ఇప్పటికే దసరా కానుకగా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ సైట్లు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

1 / 6
ఈ క్రమంలోనే చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం వన్‌ప్లస్‌ తాజాగా స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో భాగంగానే అధికారిక వెబ్‌సైట్‌లో దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది.

2 / 6
వన్‌ప్లస్ 9 ప్రో , వన్‌ప్లస్ 9 ఆర్‌తో సహా , వన్‌ప్లస్ 9 సిరీస్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. వీటితోపాటు వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌పై కూడా  డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రకటించింది. తొమ్మిది నెలల వరకు నోకాస్ట్‌ ఈఎమ్‌ఐ సౌకర్యం మరో స్పెషల్‌ ఆఫర్‌.

3 / 6
ఇక వన్‌ప్లస్‌ 9ఆర్‌, వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా రూ. 3000 తగ్గిస్తోంది. ఈ డిస్కౌంట్‌ తర్వాత వన్‌ప్లస్‌ 9ఆర్‌ రూ. 36,999, కాగా వన్‌ప్లస్‌ 9 రూ. 46,999 అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ 9 ప్రోపై 4వేల తగ్గింపుతో రూ. 60,999 లభించనుంది.

4 / 6
అక్టోబర్‌ 4 నుంచి వన్‌ప్లస్‌ ఇండియా  అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ  కార్డులపై  కూడా 7 వేల డిస్కౌంట్‌ అందిస్తోంది.

5 / 6
టీవీల విషయానికొస్తే.. 15 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. దీంతో వన్‌ప్లస్‌ వై సిరీస్‌  32-అంగుళాల టీవీ రూ. 15,999కు లభించనుంది. వీటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై తక్షణ తగ్గింపు రూ. 2000 ను అందించనుంది.  50 ఇంచెస్‌ స్మార్ట్‌టీవీ రూ. 43,999 లభిస్తోంది.

6 / 6
Follow us