OnePlus: ఎట్టకేలకు విడుదలైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. రూ. 20వేలలోనే సూపర్‌ ఫీచర్స్‌

మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను తీసుకొచ్చిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తాజాగా.. బడ్జెట్ ధరలో ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. గతకొన్ని రోజులుగా వన్‌ప్లస్‌ నార్డ్‌ సీటీ4 లైట్‌ ఫోన్‌పై టెక్‌ మార్కెట్లో వార్తలు వస్తున్న క్రమంలో ఎట్టకేలకు ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు..

Narender Vaitla

|

Updated on: Jun 25, 2024 | 7:46 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ నె 27వ తేదీ నుంచి తొలి సేల్‌ ప్రారంభంకానుంది.

1 / 5
ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19,999కాగా.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 22,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా అనేది చూడాలి.

2 / 5
వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ4 లైట్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన అమో ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1080పీ రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీస్‌ సొంతం.

3 / 5
ఇక ఇందులో 80వాట్ల ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే, 5వాట్ల రివర్స్ చార్జింగ్ (పవర్ బ్యాక్) మద్దతుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. బ్రైటర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇందులో ప్రత్యేకంగా అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఎల్వైటీ 600 మెయిన్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేసే ఈ ఫోన్‌ను.. సూపర్ సిల్వర్, మెగా బ్లూ, ఆల్ట్రా ఆరెంజ్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.

5 / 5
Follow us