- Telugu News Photo Gallery Technology photos One Plus Launches new 5g phone in india. OnePlus Nord CE2 Price And Features
OnePlus Nord CE2: వన్‌ప్లస్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..
OnePlus Nord CE2: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌లో ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి...
Updated on: Feb 18, 2022 | 5:23 PM

ప్రపంచవ్యాప్తంగా మంచి బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వన్‌ప్లస్ తాజాగా తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు.

ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను అందించారు. అంతేకాకుండా 6.43 ఇంచెస్ హెచ్‌డీఆర్+ సపోర్ట్ చేసే అమోలెడ్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఇచ్చారు. ఈ ఫోన్‌ను భారత్‌లో ఫిబ్రవరి 17న విడుదల చేశారు.

ధర విషయానికొస్తే సీఈ 2 5జీ 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ వేరియెంట్ ధర రూ.24,999గా ఉంది. ఫిబ్రవరి 22 నుంచి ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 65 డబ్ల్యూ సూపర్ వీఓఓసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీని అందించారు.





























