- Telugu News Photo Gallery Technology photos Nokia Launches low budget smart phone. nokia c01 plus features and price details
Nokia C01 plus: నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. రూ. ఆరు వేలలో అదిరిపోయే ఫీచర్లు..
Nokia C01 plus: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నొకియా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా సీ10 ప్లస్‌తో లాంచ్ చేసిన ఈ బడ్జెట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం...
Updated on: Mar 29, 2022 | 6:01 PM

బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవల పలు కంపెనీలు వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ నోకియా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. నోకియా సీ10 ప్లస్‌తో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 2 జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 6,799గా ఉండగా, 2 జీబీ + 16 జీబీ రూ. 6.299గా ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 5.45 ఇంచెస్ హెచ్‌డీ+డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ యునిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ (Unisoc SC9863a) ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నల్ స్టోరేజ్‌ను గరిష్టంగా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 5 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. రెండు కెమెరాలకు ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్ ఉండడం ప్రత్యేకత.

ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 3000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. వీటితో పాటు 4జీ ఎల్‌టీఈ, వైఫై,3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.




