- Telugu News Photo Gallery Technology photos New poco m3 pro 5g smart phone on june 8th specifications and price details
POCO M3 Pro 5G: మార్కెట్లోకి పోకో నుంచి మరో 5జీ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు..
POCO M3 Pro 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ పోకో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. పొకో ఎం3 ప్రో 5జీ పేరుతో రానున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Jun 06, 2021 | 2:11 PM

భారత్‌లో మరికొన్ని రోజుల్లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మార్కెట్లోకి 5జీ స్మార్ట్ ఫోన్‌లు సందడి చేస్తున్నాయి.

తాజాగా చైనాకు చెందిన ప్రముఖ సెల్ తయారీ కంపెనీ పొకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. జూన్ 8 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

సుమారు రూ. 15 వేలలో అందుబాటులోకి రానున్నట్లు చర్చ జరుగుతోన్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్‌ప్లేతో పాటు 90 90 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్ దీని సొంతం.

6 జీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ అందిస్తున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే.. 48 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.

5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో మొబైల్ ఛార్జింగ్ త్వరగా నిండుతుంది.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై నడిచే ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పని చేస్తుంది.




