Motorola Edge+: మోటరోలా నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటరోలా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మొన్నటి వరకు బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తున్న మోటరోలా తాజాగా ప్రీమియం ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటరోలా ఎడ్జ్‌+ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ప్రస్తుతం ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ త్వరలోనే భారత్‌లో లాంచ్‌ కానుంది..

Narender Vaitla

|

Updated on: May 06, 2023 | 4:03 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటరోలో ఇటీవల మార్కెట్లోకి వరుసగా బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. మోటరోలా ఎడ్జ్‌+2023 పేరుతో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

1 / 5
ఈ ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లో టాప్‌ ఫీచర్లను అందించారు. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్, 8జీబీ రామ్ విత్ 512 ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌ ఈ ఫోన్‌ సొంతం. 165 హెర్ట్జ్ పొలెటెడ్ డిస్ ప్లే విత్ డోల్బీ విజన్ సపోర్ట్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

2 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. 68 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ ఈ బ్యాటరీ ప్రత్యేకతలు. ప్రస్తుతం అమెరికా, కెనడా, యూరప్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ త్వరలోనే భారత్‌లో అడుగుపెట్టనుంది.

3 / 5
మోటరోలో ఎడ్జ్‌+ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ స్మార్ట్‌ఫోన్‌ను అందించారు. డోల్బీ విజన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఈ ఫోన్ డిస్లే సొంతం.

4 / 5
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో మాగ్నెటోమీటర్, ఎస్ఏఆర్ సెన్సార్, బారో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఇచ్చారు. ధర విషయానికొస్తే టాప్‌ వేరియంట్ సుమారు రూ. 80 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow us