Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best smart watches: ఈ వాచ్‌లతో మణికట్టుకు మరింత అందం.. అమెజాన్‌లో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు

ఆధునిక సమాజంలో ప్రజల అవసరాలను తీర్చడానికి అనేక రకాల ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వచ్చాయి. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. సమయంతో పాటు ఆరోగ్యం, వ్యాయామం, జీపీఎస్, కాల్స్ రిసీవ్ చేసుకోవడం.. ఇలా అనేక ఫీచర్లతో యువతకు నప్పేలా వీటిని రూపొందించారు. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో స్మార్ట్ వాచ్ లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో అమెజాన్ లో అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ ల గురించి, వాటి ప్రత్యేకతలు, ధర వివరాలను తెలుసుకుందాం.

Srinu

|

Updated on: Mar 05, 2025 | 6:31 PM

మీ చేతి మణికట్టుకు అందాన్నిచ్చే స్మార్ట్ వాచ్ లలో ఆపిల్ వాచ్ ముందుంటుంది. సన్నని, తేలికపాటి, సౌకర్యవంతమైన డిజైన్ తో దీన్ని రూపొందించారు. పెద్ద డిస్ ప్లే కారణంగా సెట్టింగ్ లను చక్కగా చేసుకోవచ్చు. త్వరగా చార్జింగ్ అవ్వడం, 18 గంటల బ్యాటరీ బ్యాకప్, కాల్స్ మాట్లాడడం, సంగీతం వినడం, నోటిఫికేషన్లు చూసుకోవడం దీని ప్రత్యేకతలు, ముఖ్యంగా ఈ స్మార్ట్ వాచ్ ను ఉపయోగించి ఈసీజీ కూడా తీసుకోవచ్చు. రుతుచక్రం, హార్టుబీటుతో పాటు ఫాల్, క్రాష్ డిటెక్షన్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ ధరించిన వ్యక్తి పడిపోయినా, జారినా వెంటనే మెసేజ్ రూపంలో సమాచారం వెళుతుంది. అమెజాన్ తో రూ.38,999కి ఈ వాచ్ ను అందుబాటులో ఉంచారు.

1 / 5
బోట్ కంపెనీ నుంచి విడుదలైన ఈ స్మార్ట్ వాచ్ లో 5.10 సెంటీమీటర్ల హెచ్ డీ డిస్ ప్లే ఆకట్టుకుంటోంది. స్పష్టమైన విజువల్స్, సులభమైన నావిగేషన్ ను అందిస్తుంది. ఇంటిలోనూ, బయట కూడా చక్కగా వినియోగించుకోవచ్చు. టర్న్ బై టర్న్ నావిగేషన్, ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్, దుమ్ము, చెమట నుంచి రక్షణ వ్యవస్థ, గేమ్ లు, వ్యాయామం కోసం 700 పైగా యాక్టివ్ మోడ్ లు దీనిలో ఉన్నాయి. సుమారు 2 గంటల్లో బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు. అమెజాన్ లో దీని ధర రూ.1.999 మాత్రమే.

2 / 5
బోట్ బ్రాండ్ నుంచి విడుదలైన ఎక్స్ టెండ్ సిరీస్ స్మార్ట్ వాచ్ లో 1.69 అంగుళాల ఎల్సీడీ డీస్ ప్లే ఏర్పాటు చేశారు. దీని ద్వారా సమయాన్ని స్పష్టంగా చూడడంతో పాటు సెట్టింగ్ లలో సర్దుబాట్లు కూడా చక్కగా చేసుకోవచ్చు. అంతర్మిర్మిత అలెక్సా వాయిస్ అసిస్టెంట్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్, ఫిట్నెస్ ట్రాకర్, పెడో మీటర్, క్యాలెండర్, అలారం తదితర ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని యాంబియంట్ లైట్ డిస్ ప్లే కారణంగా వాచ్ లైటింగ్ బయటి వాతావరణానికి అనుగుణంగా మారుతుంది. సుమారు రెండు గంటల్లో బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవుతుంది. అమెజాన్ లో రూ.1799కి ఈ వాచ్ అందుబాటులో ఉంది.

3 / 5
ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఫాసిల్ స్మార్ట్ వాచ్ పనిచేస్తుంది. మాగ్నెటిక్ డాక్ స్నాప్ లతో కూడిన యూఎస్ బీ డేటా కేబుల్ ద్వారా చార్జింగ్ చాలా త్వరగా చేసుకోవచ్చు. నిద్ర, గుండె వేగం, రక్త ఆక్సిజన్ తదితర వాటిని ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేసుకోవచ్చు. అత్యంత తేలికైన ఈ వాచ్ బ్యాటరీ జీవితం 24 గంటలు. లిథియం - అయాన్ బ్యాటరీ, స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్, బ్లూటూత్ కనెక్టివిటీ అదనపు ప్రత్యేకతలు. ఈ వాచ్ ను అమెజాన్ లో రూ.12,498కి కొనుగోలు చేయవచ్చు.

4 / 5
సామ్సంగ్ నుంచి విడుదలైన ఈ వాచ్ పురుషులకు బాగా నప్పుతుంది. దీనిలో 1.47 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ప్రకాశవంతమైన కాంతిలో కూడా చాాలా స్పష్టంగా అక్షరాలు కనిపిస్తాయి. 3 ఎన్ఎం ప్రాసెసర్ తో బ్యాటరీ జీవితాన్ని తెలుసుకోవచ్చు. బయోయాక్టివ్ సెన్సార్ మీకు ఆరోగ్యం, ఫిట్ నెస్ విషయాలను అందిస్తుంది.డ్యూయల్ జీపీఎస్ ఫీచర్ తో లొకేషన్ ను క్రాకింగ్ చేసుకోవచ్చు. కెమెరా, కాల్స్, పాల్ డిటెక్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ ను అమెజాన్ లో రూ.32,499కి కొనుగోలు చేయవచ్చు.

5 / 5
Follow us