itel Icon 2: వెయ్యి రూపాయాల స్మార్ట్‌ వాచ్‌లో ఇన్ని ఫీచర్లా.? మార్కెట్లోకి నయా మాల్‌..

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్‌ హవా నడుస్తోంది. ఒకప్పుడు వేలు పలికిన స్మార్ట్‌ ఫోన్‌ ధరలు ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐటెల్ కంపెనీ మార్కెట్లోకి బడ్జెట్ వాచ్‌ను లాంచ్‌ చేసింది..

Narender Vaitla

|

Updated on: Mar 07, 2024 | 10:07 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఐటెల్‌ మార్కెట్లోకి కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఐటెల్‌ ఐకాన్‌2 పేరుతో ఈ వాచ్‌ను లాంచ్‌ చేశారు. రోజ్‌ గోల్డ్‌, బ్లూ, బ్లాక్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ వాచ్‌ ధరను రూ. 1099గా నిర్ణయించారు.

1 / 5
ఇక ఈ వాచ్‌లో 24 గంటల రియల్‌ టైమ్‌ హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌, క్విక్‌ కంటాక్ట్స్‌, డయల్‌ ప్యాడ్‌, కాల్‌ హిస్టరీ వంటి ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌పై వాచ్‌పై ఏడాది వారంటీ అందిస్తున్నారు.

2 / 5
ఐటెల్‌ ఐకాన్‌ 2 స్మార్ట్‌వాచ్‌లో 1.83 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 2.5డీ కర్వ్‌డ్‌ డిజైన్‌తో దీనిని రూపొందించారు. 550 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ వాచ్‌ సొంతం. 30 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

3 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌లో దుమ్ము, వాటర్‌ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‌ను అందించారు. అలాగే ఇందులో ఎస్‌పీఓ2, స్లీప్‌ పాట్రన్స్‌, హార్ట్‌రేట్‌, ఫిమేల్‌ హెల్త్‌ ఇండికేటర్స్‌ వంటి ఫీచర్లను అందించారు.

4 / 5
ఐకాన్‌ 2 స్మార్ట్‌ వాచ్‌లో ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ ఆప్షన్‌ను కూడా అందించారు. దీంతో మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి వాటిని ఆపరేట్‌ చేసుకోవచ్చు. అలాగే బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు.

5 / 5
Follow us