- Telugu News Photo Gallery Technology photos Huge discount on Poco x5 pro, Have a look on features and price details
Poco X5 Pro: పోకో ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. పోకో ఎక్స్5 ప్రో ఇటీవల మార్కెట్లోకి అందుబాటులో వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 3 వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందన్న దానిపై ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 14, 2023 | 7:18 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో ఎక్స్5 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 22,999 కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 3000 డిస్కౌంట్‌ను అందిస్తుండడం విశేషం. అయితే ఈ డిస్కౌంట్ ఎన్ని రోజులు ఉంటుందన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో నడుస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ కెమెరాతో 4కే రిజల్యూషన్ వీడియోతో కూడిన వీడియోలను చిత్రీకరించొచ్చు.




