- Telugu News Photo Gallery Technology photos Gmail introducing new option for delete mails automatically
Gmail: అవసరం లేని మెయిల్స్ వాటంతటవే డిలీట్ అవ్వాలనుకుంటున్నారా.? అయితే ఈ ఆప్షన్ మీకోసమే..
Gmail: అవసరం ఉన్నా లేకున్నా వచ్చే మెయిల్స్‌తో విసుగు చెందుతున్నారా.? మీకు అవసరం లేని మెయిల్స్ వాటంతటవే డిలీట్ అయ్యే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ..! ఇందుకోసమే జీమెయిల్ తాజాగా ఓ కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది..
Updated on: Dec 31, 2021 | 12:20 PM

మనకు అవసరం ఉన్నవి, లేనివి అనే తేడా లేకుండా రోజూ వందల సంఖ్య మెయిల్స్ ఇన్‌బాక్స్‌లో హోరెత్తుతుంటాయి. వీటిలో ప్రమోషన్స్ మెయిల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే వీటన్నింటినీ ఒక్కొక్కటిగా డిలీట్ చేయడం సమయంతో కూడుకున్న విషయం. అలా కాకుండా ఇలాంటి అనవసరమైన మెయిల్స్ వాటంతటవే ఆటోమెటిక్‌గా డిలీట్ అయితే బాగుటుంది. కదూ.. ఇందుకోసమే జీమెయిల్‌లో ఓ ఆప్షన్ ఉందని మీకు తెలుసా.?

ఇందు కోసం ముందుగా జీమెయిల్‌ను ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో ఫిల్టర్స్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఈ ఐకాన్ కనిపించకపోతే సెట్టింగ్స్ సెక్షన్‌లో ఫిల్టర్స్ అండ్ బ్లాక్‌డ్ అడ్రసెస్ ట్యాబ్‌పై సెలక్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఫిల్టర్స్ అండ్ బ్లాక్‌డ్ అడ్రెసెస్ ట్యాబ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం Create a new filter బటన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే ఫామ్‌పై సెలక్ట్ చేయాలి.

అనంతరం అందులో మీకు ప్రాధాన్యత అనిపించవి మెయిల్ ఐడీలను ఎంటర్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇకపై ఆ మెయిల్ ఐడీ నుంచి వచ్చే మెయిల్స్ వాటంతటవే డిలీట్ అవుతాయి.

అయితే ఈ ఫీచర్ ద్వారా ఇప్పటికే ఉన్న మెయిల్స్ డిలీట్ కావు. కానీ కొత్తగా మీరు సెలక్ట్ చేసుకున్న మెయిల్ ఐడీల నుంచి వచ్చే మెయిల్స్ ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుంటాయి.




