Narender Vaitla |
Updated on: Jun 14, 2021 | 5:59 AM
స్మార్ట్ వాచ్ తయారీ రంగంలో రోజురోజుకీ పోటీ పెరుగుతోంది. టాప్ బ్రాండ్ కంపెనీలన్నీ స్మార్ట్ వాచ్ తయారీ రంగంలోకి వచ్చేశాయి.
బ్లూటూత్ వీ4.0 టెక్నాలజీతో పనిచేసే ఈ వాచ్‌ను కేవలం రెండు గంటల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌పై ఒక సంవత్సరం, స్ట్రాప్‌పై ఆరు నెలల వారంటీని అందించనున్నారు.
1.3 ఇంచెస్ టీఎఫ్‌టీ ఎల్సీడీ టచ్ స్క్రీన్, 240 x 240 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ దీని సొంతం. ఆండ్రాయిడ్ 5.1, ఐవోఎస్ 9.0 ఆ పై ఆపరేటింగ్ సిస్టంలకు సపోర్ట్ చేస్తుంది.
రియల్‌టైమ్ హార్ట్ రేట్ మానిటర్‌తో పాటు.. వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ వంటి ఇతర స్పోర్ట్స్ మోడ్స్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఇందులో ఉంది.
పెరుగుతోన్న పోటీకి అనుగుణంగానే జియోనీ కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. జియోనీ స్టైల్‌ఫిట్ జీఎస్‌డబ్ల్యూ7 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ. 2,099గా కావడం విశేషం.
రిమోట్ కెమెరా ఫీచర్ ఈ వాచ్ మరో ప్రత్యేకత.. దీని ద్వారా వాచ్ నుంచే కనెక్ట్ చేసిన ఫోన్‌లో ఫొటోలు తీయవచ్చు.