- Telugu News Photo Gallery Technology photos Follow these techniques to prevent smartphone addiction in kids
Smart phone addiction: మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్‌కు బానిసలయ్యారా.? ఇలా చేయండి..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియం అనివార్యంగా మారిపోయింది. స్కూలుకు వెళ్లే చిన్నారుల నుంచి రిటైర్ అయిన ఉద్యోగి వరకూ ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. అయితే ఒకప్పుడు అవసరంగా ఉన్న ఫోన్, స్మార్ట్ ఫోన్ రాకతో వ్యసనంగా మారింది. ముఖ్యంగా చిన్నారులు గంటలతరబడి ఫోన్‌లతో గడిపేస్తున్నారు. మరి ఈ వ్యసనాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 15, 2024 | 10:03 AM

ఒకప్పుడు ఆటలు ఆడుతూ సరదగా గడిపే చిన్నారులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారారు. గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌తో కుస్తీ పడుతున్నారు. అయితే చిన్నారులను స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని దూరం చేయడానికి కొన్ని రకాల టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని రకాల స్మార్ట్ ఫోన్స్‌లో స్క్రీన్ టైమ్ లిమిట్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంగా ప్లేస్టోర్‌లో ఇలాంటి యాప్స్ అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ సహాయంతో ఫోన్‌లో స్క్రీన్ టైమ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీరు సెట్ చేసిన సమయానికి స్క్రీన్ దానంతట అదే ఆఫ్ అయ్యేలా చేసుకోవచ్చు.

ఇక చిన్నారులకు ఫోన్‌ను దూరం చేయాలంటే ముందుగా వారికి శారీరక క్రీడలపై మక్కువ పెరిగేలా చేయాలి. స్కూల్ నుంచి రాగానే కాసేపు గ్రౌండ్‌లో ఆటలు ఆడిపియ్యాలి. లేదా ఏదైనా స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ చేయించాలి. వీటివల్ల వారి మనసు ఫోన్ వైపు మళ్లకుండా ఉంటుంది.

ఇంట్లో వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా చూసుకోవాలి. పిల్లల ముందు పెద్దలు కూడా వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను ఉపయోగించకుండా ఉండడమే మంచిది. దీనివల్ల వారి ఆలోచన కూడా అటుగా వెళ్లదు.

అలాగే స్కూల్ నుంచి రాగానే చిన్నారుల చేతుల్లో స్మార్ట ఫోన్స్ ఇచ్చి కూర్చొబెట్టకూడదు. వారితో వీలైనంత వరకు ఇంటరాక్ట్ అవ్వాలి. స్కూల్‌లో ఏం చేశారన్న విషయాలను అడిగి తెలుసుకుంటూ, వారితో కమ్యూనికేషన్ మెయింటెన్ చేయాలి. వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాలి.

పిల్లలు ఖాళీగా ఉన్న సమయంలో వారికి ఇతర వ్యాపకాన్నిఅలవాటు చేయాలి. డ్రాయింగ్, చెస్, పెయింటింగ్ వంటి నైపుణ్యాలను నేర్పించాలి. వీటివల్ల వారు ఆ పనుల్లో బిజీగా మారి, స్మార్ట్ ఫోన్ జోలికి వెళ్లకుండా ఉంటారు.




