- Telugu News Photo Gallery Technology photos Best power banks under 1500, Check here for price and features
Cheap Power Banks: తక్కువ ధరలో పవర్ బ్యాంక్ కోసం సెర్చ్ చేస్తున్నారా.? అయితే ఇవే బెస్ట్ డీల్స్.
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరికీ ఛార్జింగ్ పెద్ద సమస్యగా మారిపోతోంది. దీంతో చాలా మంది పవర్ బ్యాంక్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఎక్కువ ధర ఉన్న పవర్ బ్యాంక్‌లు ప్రస్తుతం తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో తక్కువ ధరలో మంచి కెపాసిటీతో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఫీచర్స్, ధరలపై ఓ లుక్కేయండి..
Updated on: Oct 07, 2023 | 1:31 PM

Amazon Basics: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ అమెజాన్ బేసిక్స్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. అమెజాన్ బేసిక్స్10000 ఎమ్ఏహెచ్‌తో భారీ కెపాసిటీతో కూడిన పవర్ బ్యాంక్‌ను అందిస్తోంది. ఈ పవర్ బ్యాంక్ అసలు ధర రూ. 1,999కాగా, ఆఫర్‌లో భాగంగా రూ. 649కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఇందులో 10,000 ఎమ్‌ఏహెచ్ లిథియం పాలిమర్ బ్యాటరీని అందించారు. మైక్రో యూఎస్‌బీ లేదా టైప్ సీ ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఆటో షట్ ఆఫ్, ఎల్‌ఈడీ ఇండికేటర్ లైట్స్, థర్మల్ ప్రొటెక్షన్ ఐసీ వంటి ఫీచర్స్ ఉన్న ఈ పవర్ బ్యాంక్ ఎంచక్కా చేతిలో ఇమిడిపోతుంది.

Ambrane: Ambrane 10000mAh Slim Power Bank పవర్ బ్యాంక్ అసలు ధర రూ. 1599కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 799కి అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 20 వాట్స్ బూస్టెడ్ స్పీడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ పవర్ బ్యాంక్‌లో 10,000 ఎమ్‌ఏహెచ్ లిథియం పాలీమర్ బ్యాటరీని అందింఆచరు. 180 రోజుల వారంటీతో తీసుకొచ్చిన ఈ పవర్ బ్యాంక్‌లో ఫాస్ట్ ఛార్జిగ్, ఎల్‌ఈడీ ఇండికేటర్ లైట్స్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్‌ను అందించారు.

Belkin: Belkin 10000 mAh PD 3.0 Slim Fast Charging పవర్ బ్యాంక్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 3499కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 1699కి అందిస్తున్నారు. 40 గంటలకుపైగా బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ పవర్ బ్యాంక్‌తో ఐఫోన్ 12ను రెండుసార్లు ఫుల్ ఛార్జ్ చేసుకోవచచు. ఎల్‌ఈడీ ఇండికేటర్ లైటర్‌తో తీసుకొచ్చిన ఈ పవర్ బ్యాంక్‌కు 2 ఏళ్ల వారంటీని అందించారు.

Mi 10000mAH Li-Polymer: ఈ పవర్ బ్యాంక్‌ను యూఎస్‌బీ, టైప్ సీ పోర్ట్‌తో రూపొందించారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ పవర్ బ్యాంక్ సొంతం. 10000 బ్యాటరీ కెపాసిటీతో రూపొందించిన ఈ పవర్ బ్యాంక్‌కి 6 నెలల వారంటీ ఇస్తున్నారు. అమెజాన్‌లో అందుబాటలో ఉన్న ఈ పవర్ బ్యాంక్ ధర రూ. 1,149గా ఉంది. ఇందులో మొత్తం మూడు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి.

URBN: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ పవర్ బ్యాంక్.. URBN 10000 mAh Li-Polymer Ultra Compact Power Bank. ఇందులో యూఎస్‌బీ, మైక్రో యూఎస్‌బీ చార్జింగ్ ఆప్షన్‌ను అందించారు. 3000 ఎమ్ఏహెచ్ ఫోన్ బ్యాటరీని 2.4 సార్లు చార్జింగ్ చేసుకోవచ్చు. డ్యూయల్ యూఎస్‌బీ అవుట్‌పుట్ 2.4 ఏఎమ్‌పీ 5వీ ఫాస్ట్ చార్జింగ్‌తో దీనిని రూపొందించారు. ఫాస్ట్ ఛార్జింగ్, టూ వే ఫాస్ట్ చార్జ్, రీఛార్జ్ వంటి అధునాతన ఫీచర్స్ ఈ పవర్ బ్యాంక్ సొంతం.





























