- Telugu News Photo Gallery Technology photos Best headset under RS 2500 with long battery and advanced features
Headphones: బెస్ట్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటున్నారా.? తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే హెడ్‌సెట్స్
ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఎక్కువగా మ్యూజిక్ వినడానికి ఉపయోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం హెడ్‌సెట్‌కు కూడా భారీగా ఆదరణ పెరుగుతోంది. ఇక హెడ్‌సెట్స్ అనగానే ధర ఎక్కువనే ఆలోచనలో ఉంటాం. కానీ మార్కెట్లో ప్రస్తుతం తక్కువ ధరకు సైతం హెడ్‌సైట్స్ లభిస్తున్నాయి. ఈ కామర్స్‌సైట్స్‌లో సేల్‌లో భాగంగా తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ హెడ్‌సెట్స్, వాటి ధరకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 08, 2024 | 10:12 PM

తక్కువ ధరలో లభిస్తోన్న మరో బెస్ట్ హెడ్ సెట్స్‌లో బోట్ ఇమ్మోర్టల్ 1000డీ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. గేమింగ్ కోసం ఈ హెడ్‌సెట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. బోట్ హెడ్‌ఫోన్‌లో LED లైట్, డాల్బీ అట్మాస్, హెచ్‌డీ సౌండ్ వంటి ఫీచర్లను అందించారు. ఈ హెడ్‌సెట్ ధర రూ. 2399గా నిర్ణయించారు.

ఇక తక్కువ ధరకు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ హెడ్ సెట్స్‌లో బోట్ రాకర్జ్ 600 ఒకటి. లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 300 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇందులో 400ఎమ్ఎమ్ డ్రైవర్లను అందించారు. ఈ హెడ్‌సెట్ ధర రూ. 2499గా నిర్ణయించారు.

గేమింగ్ కోసం హెడ్‌సెట్ ఉపయోగించే వారికి కాస్మిక్ బైట్ ఈక్వినాక్స్ యూరోపా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 7.1 సౌండ్, ఆర్‌జీబీ లైటింగ్ వంటి అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ గేమింగ్ హెడ్‌సెట్ 7.1 సరౌండ్ సౌండ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 2499గా ఉంది.

మంచి బ్యాటరీ లైఫ్, స్టన్నింగ్ డిజైన్ కోరుకునే వారికి హెచ్‌పీ 500 హెడ్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ హెడ్‌సెట్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 2004కి లభిస్తోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 20 గంటలపాటు పనిచేస్తుంది.

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ హెడ్‌సెట్స్‌లో జిబ్రోనిక్ కంపెనీకి చెందిన జెబ్ బాంగ్ ప్రో హెడ్‌సెట్ ఒకటి. ఇందులో డీప్ బేస్, వాయిస్ అసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. స్టైలిష్ లుక్‌తో డిజైన్ చేసిన ఈ హెడ్‌సెట్ ధర రూ. 2499గా ఉంది.




