- Telugu News Photo Gallery Technology photos Best 5G phones available under 25 thousand, Super features and special features, Best 5G phones details in telugu
Best 5G phones: 25 వేలలోపు లభించే బెస్ట్ 5జీ ఫోన్లు.. ఫీచర్లు, ప్రత్యేకతలు సూపర్..!
దేశంలో ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అత్యవసర వస్తువుగా మారింది. మన జీవితంతో దీని పరిధి పెరుగుతూ పోతోంది. స్మార్ట్ ఫోన్ లేకపోతే ఒక్క రోజు కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. కేవలం మాట్లాడటానికి మాత్రమే కాదు, అనేక లావాదేవీలకు అవసరమవుతుంది. కాబట్టి ఫోన్ ను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అనేక విషయాలను గమనించాలి. చిప్ సెట్, బ్యాటరీ, కెమెరాలు, స్టోరేజీ, ర్యామ్ ను పరిశీలించాలి. అయితే మంచి నాణ్యత కలిగిన ఫోన్ కోసం భారీగా డబ్బులు ఖర్చుచేయనవసరం లేదు. కేవలం రూ.25 వేలలోపు ధరలోనే ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ లో సిద్ధంగా ఉన్న ఆ ఫోన్ల వివరాలు తెలుసుకుందాం.
Srinu |
Updated on: Dec 11, 2024 | 6:30 PM

హానర్ ఎక్స్9బీ ఫోన్ లోని 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేతో విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. 5,800 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ అయిపోతుందనే సమస్య ఉండదు. 5 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మైక్రో సెన్సార్, 108 ఎంపీ ప్రైమరీ, ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంది. దీనిలోని అల్ట్రా బౌన్స్ టెక్నాలజీ కారణంగా ఫోన్ నేలపై పడిపోయినా విరిగిపోదు. అమెజాన్ లో రూ.24,998కు ఈ ఫోన్ ను కొనుగోలు చేసుకోవచ్చు.

దీర్ఘకాలం మన్నిక కలిగిన ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి మోటారోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ మంచి ఎంపిక. దీనిలో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, ఐపీ 68 డస్ట్, వాటర్ రెసిస్టెన్సీ, 1.5కె రిజల్యూషన్, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగిన ఓలెడ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ రూ.2,3185కు అమెజాన్ లో అందుబాటులో ఉంది.

నథింగ్ 2ఏ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ లో అందుబాటులోకి వచ్చింది. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 6.7 అమోలెడ్ డిస్ ప్లే తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. నథింగ్ ఓఎస్ తో క్లీన్, మినిమలిస్టిక్ సాఫ్ట్ వేర్ అనుభవాన్ని అందిస్తుంది. అమెజాన్ లో రూ.22,500కు ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ ను గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీనిలోని స్నాప్ డ్రాగన్ 7 జెన్ చిప్ సెట్ తో పనితీరు చాలా సమర్థవంతంగా ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ను 30 నుంచి 40 నిమిషాల్లోనే పూర్తిగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ రూ.22,999కు అమెజాన్ లో అందుబాటులో ఉంది.

రియల్ మీ నార్జో 70 టర్బో స్మార్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ సెట్ ఏర్పాటు చేశారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 120 హెచ్ జెడ్ డిస్ ప్లే తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. గేమింగ్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. సుదీర్ఘంగా ఆడుకునేందుకు వీలుగా స్లెయిన్ స్టీల్ ఆవిరి కూలింగ్ చాంబర్ ఏర్పాటు చేశారు. అమెజాన్ లో ఈ ఫోన్ ను రూ.17,998కి కొనుగోలు చేయవచ్చు.





























