iPad Pro m2: యాపిల్‌ నుంచి కొత్త ఐప్యాడ్‌.. అత్యంత పలుచనైన మోడల్‌..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థ యాపిల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ నుంచి ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ వస్తుందంటే చాలు అందరి దృష్టి వీటిపైనే పడుతుంది. అధునాతన హైఎండ్‌ సెక్యూరిటీ ఫీచర్లతో గ్యాడ్జెట్స్‌ను తీసుకొస్తారు కాబట్టే యాపిల్‌కు ఇంతటి క్రేజ్‌ లభిస్తుంది. ఇక నిత్యం కొంగొత్త ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తున్న యాపిల్‌ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ప్రోడక్ట్స్‌ను లాంచ్‌ చేసింది...

Narender Vaitla

|

Updated on: May 09, 2024 | 7:59 PM

యాపిల్‌ బ్రాండ్‌కు సంబంధించి ఐఫోన్స్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందో. ఐప్యాడ్‌కు కూడా అంతే క్రేజ్‌ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ఐప్యాడ్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఐప్యాడ్స్‌కు మంచి ఆదరణ లభించింది.

1 / 5
ఇదిలా ఉంటే తాజాగా యాపిల్‌ నుంచి కొత్త ఐప్యాడ్‌ లాంచ్‌ అయ్యింది. ఐప్యాడ్‌ ప్రోఎం2 పేరుతో ఈ ఐప్యాడ్‌ను తీసుకొచ్చారు. యాపిల్‌ నుంచి వచ్చిన అత్యంత పలుచైన ఐప్యాడ్ ఇదే కావడం విశేషం.

2 / 5
ఇక ఈ ఐప్యాడ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన ఐప్యాడ్ ప్రో 5.33ఎంఎం, 13 అంగుళాల వెర్షన్ 5.1ఎంఎం మందంతో తీసుకొచ్చారు. ఈ రెండు మోడల్స్‌లోనూ ఆల్ట్రా రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. వీటి స్క్రీన్లను కూడా నానో-టెక్చర్ గ్లాస్‌తో తయారు చేశారు.

3 / 5
అన్ని యాపిల్‌ స్టోర్స్‌తో పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఐప్యాడ్‌లో ఎం4 చిప్‌సెట్‌ను అందించారు. ఐప్యాడ్‌ ప్రోను 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ వంటి నాలుగు స్టోరేజ్ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు.

4 / 5
ఇక ధర విషయానికొస్తే 11 అంగుళాల వెర్షన్ వైఫై మోడల్ ధర రూ. 99,900, వైఫై+సెల్యూలార్ ప్రారంభ ధర రూ. 1,19,900గా నిర్ణయించారు. 13 అంగుళాల వెర్షన్ ధర వైఫై రూ. 1,29,900, వైఫై+సెల్యూలార్ ధర రూ. 1,49,900 నుంచి ప్రారంభమవుతుంది.

5 / 5
Follow us