హానర్ ప్యాడ్ 8.. ఈ ట్యాబ్లెట్లో ఏకంగ ఆరు సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి. వీటి ద్వారా క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్లారిటీని అందిస్తాయి. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. 11.5 అంగుళా స్క్రీన్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో 2కే డిస్ ప్లే, ఎస్ఆర్జీబీ స్క్రీన్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 685 ప్రాసెసర్ ఉంటుంది. సరికొత్త ఆండ్రాయిడ్ 13 వెర్షన్ పై వస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 14,999గా ఉంది.