- Telugu News Photo Gallery Technology photos Amazon offering discount on Nokia G42 5G smartphone, Check here for full details
Nokia G42 5G: రూ. 10వేలలో సూపర్ 5జీ ఫోన్.. నోకియా బ్రాండ్ నుంచి..
ఒకప్పుడు ఫీచర్ మొబైల్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన నోకియా ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అంతలా రాణించలేకపోయింది. అయితే విండోస్ ఫోన్‌లను విడుదల చేసినా అవి కూడా పెద్దగా క్లిక్ అవ్వలేవు. దీంతో నోకియా సైతం స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగు పెట్టింది. తాజాగా అమెజాన్‌లో నోకియా జీ42 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది..
Updated on: Jul 05, 2024 | 10:01 PM

నోకియా జీ42 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఇంతకీ ఫోన్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

నోకియా జీ 42 5జీ ఫోన్ అసలు ధర రూ. 12,999కాగా అమెజాన్‌లో 23 శాతం డిస్కౌంట్‌తో ర. 9,999కి సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ పే బ్యాలెన్స్‌తో పే చేసే వారికి రూ. 300 క్యాష్‌బాక్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌ను మీ పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 9,450 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5జీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 50000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఇందులో లిథియం పాలిమార్ బ్యాటరీని అందించారు. బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ, 3.5 ఎమ్‌ఎమ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 గంటల టాక్ టైమ్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఫోన్ బరువు 194 గ్రాములుగా ఉంటుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ ఏఐ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌తో పాటు మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్, 2 ఏళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్, ఏడాది మ్యానిఫ్యాక్చరింగ్ వారంటీ అందిస్తున్నారు.




