- Telugu News Photo Gallery Technology photos Amazon great freedom festival sale Check these Best smartphones with price near 6000 Telugu Tech News
Smart phones: ఆరు వేల రూపాయలలో అదరగొట్టే స్మార్ట్ ఫోన్లు.. కిక్కేక్కించే ఆఫర్లపై ఓ లుక్కేయండి..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రాడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లపై మునుపెన్నడూ లేని విధంగా డిస్కౌంట్ లభిస్తున్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్‌లపై ఏకంగా 30 శాతం వరకు డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇలా అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో రూ. 6 వేలకే పలు బ్రాండ్‌లకు సంబంధించిన ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా రూ. 6 వేలలో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్లు, వాటి ఫీచర్లకు సంబందించిన వివరాలు మీకోసం..
Updated on: Aug 07, 2023 | 11:08 AM

Itel A60s: ఇంటెల్ స్మార్ట్ ఫోన్‌పై 26 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 8,499కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 6,299కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 ఎంపీ రెయిర్ కెమెరాతోపాటు, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Nokia C12: నోకియా సీ12 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 7,499కాగా 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 5,999కి లభిస్తోంది. 6.3 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 2జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

Realme narzo 50i Prime: రియల్ మీ నార్జో 50ఐ ప్రైమ్ అసలు ధర రూ. 8,999కాగా 26 శాతం డిస్కౌంట్‌తో రూ. 6,699కి లభిస్తోంది. ఆక్టాకోర్ ప్రాసెసర్ 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఇందులో 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు.

Redmi A2: రెడ్‌మీ ఏ2 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 8,999కాగా 30 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,299కే లభిస్తోంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌ను అందించారు. 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. ఇందులో 16.5 సె.మీ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

TECNO POP 7 Pro: రూ. 6 వేలలో లభిస్తోన్న మరో స్మార్ట్ ఫోన్ టెక్నో పాప్ 7ప్రో. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 8,999కాగా 31 శాతం డిస్కౌంట్ పోను రూ. 6,199కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 12 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. 6.56 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 26 గంటల కాలింగ్ స్టాండ్‌బై ఇస్తుంది.





























