AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: టీ Vs కాఫీ: లేవగానే ఏది తాగడం ఆరోగ్యానికి మంచిది?

మన డైలీ రోటీన్‌లో టీ, కాఫీ చాలా ముఖ్యమైనవి. చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ, లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. వాటిని తీసుకోవడం వల్ల మనకు ఉపసమనం దొరకడమే కాకుండా మన శరీరానికి శక్తిని కూడా లభిస్తుంది. అయితే ఉదయం లేచిన వెంటనే కాఫీ, లేదా టీ ఏది తాగితే ఆరోగ్యానికి మంచిది అనే డౌట్‌ చాలా మందిలో ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు వెర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఉదయం దేన్ని తీసుకోవడం మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Sep 07, 2025 | 3:59 PM

Share
ముందుగా, కెఫిన్ విషయానికి వస్తే, ఒక కప్పు కాఫీలో 80-100 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. ఇది మీకు వెంటనే శక్తిని ఇస్తుంది. దీని వల్ల మీరు యాక్టీవ్‌గా మారుతారు. కానీ ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల ఆందోళన, నిద్ర సమస్యలు రావచ్చు.

1 / 5
టీలోని టానిన్లు దంతాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల అవి పసుపు రంగులోకి మారుతాయి. దంతక్షయానికి దారితీస్తాయి. టీలో ఉండే ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని మీకు తెలుసా. ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది.

2 / 5
ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, టీ, ముఖ్యంగా గ్రీన్ టీ, బ్లాక్ టీలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి సహాయపడతాయి. కాఫీలో పాలీఫెనాల్స్, క్లోరోజెనిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును రక్షిస్తాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాఫీ కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి, టీ మన గుండె, రోగనిరోధక వ్యవస్థకు మంచిదే అయినప్పటికీ, కాఫీ మెదడు, కాలేయాన్ని రక్షిస్తుంది.

3 / 5
అయితే, ఈ రెండింటిలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. ఎక్కువ కాఫీ తాగడం వల్ల ఆమ్లత్వం, నిద్ర,  ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. అలాగే ఎక్కువ టీ తాగడం వల్ల ఇనుము శోషణ తగ్గుతుంది, నిద్రకు అంతరాయం కలుగుతుంది. రెండూ మూత్రవిసర్జన మందులు కాబట్టి, ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి మితంగా తాగడం ముఖ్యం.

4 / 5
మొత్తంమీద, టీ, కాఫీ రెండింటికీ వాటి సొంత ప్రత్యేకమైన ఉపయోగాలు ఉన్నాయి. కాఫీ త్వరిత శక్తిని, జీవక్రియకు దొహదపడుతుంది. టీ ప్రశాంతత, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు ఏది బెస్ట్‌ అనేది మీరు ఎలాంటి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

5 / 5