ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల జీవితాల్లో గందరగోళం తప్పదంట!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు, నక్షత్రాలకు ఉండే ప్రాముఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రహాలు అనేవి రాశులను, నక్షత్రాలను మార్చుకుంటాయి. దీంతో దీని ప్రభావం 12 రాశులపై పడుతుంది. అందులో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే, మరికొన్ని రాశుల వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అయితే సూర్యుడు త్వరలో తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి కష్టాలు నష్టాలు తప్పవంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
Updated on: Jun 20, 2025 | 1:16 PM

జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాల్లో సూర్యు గ్రహాం ఒకటి. అయితే ప్రస్తుతం సూర్యుడు మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కాగా, అతి త్వరలో సూర్యుడు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. జూన్ 22న ఆది వారం రోజున మృగశిర నుంచి ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈ నక్షత్రానికి అధిపతిగా రాహువు ఉండటం వలన మూడు రాశుల వారి జీవితాల్లో గందరగోళం మొదలు కానుంది. ఆర్థిక నష్టాలు, కష్టాలు ఏర్పడుతాయంట. కాగా, రాశులు ఏవి అంటే?

మిథున రాశి : మిథున రాశి వారికి సూర్యుడి సంచారం వలన అనేక సమస్యలు ఎదురుకానున్నాయంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. చేపట్టిన పనుల్లో సమస్యలు తలెత్తుతాయంట. కొన్ని పనులు ఆగిపోయే ప్రమాదం కూడా ఉన్నదంట. వ్యాపారస్తులు అనేక నష్టాలు చవిచూస్తారు. భాగస్వామ్య ఒప్పందాలకు పూనుకోకపోవడమే మంచిది. కుటుంబంలో కూడా కొన్ని విభేదాలు చోటు చేసుకోవడంతో చాలా సమస్యలు వస్తాయంట. అందుకే ఈ రోజుల్లో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట.

ధనస్సు రాశి : ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడి సంచారంతో ధనస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు తప్పవంట. వీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే ఎవరైతే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈసారి కూడా నిరాశే తప్పదంట. ఏ పని చేసినా అది పూర్తి చేయలేకపోతారంట. అంతే కాకుండా విద్యార్థులు మానసిక సమస్యలు ఎదుర్కొంటారంట.

అంతే కాకుండా కొంత మందిచేత అనుకోకుండా మాటలు పడటం. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం, కొన్ని సార్లు చేయని తప్పులకు నిందలు పడటం వంటివి జరగడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారంట. వీరికి ఈ రోజులన్నీ చాలా కష్టంగా గడుస్తాయంట. చాలా సమస్యలను ఎదుర్కొంటారంట.

కన్యా రాశి : కన్యారాశి వారికి జూన్ 22 నుంచి కష్టాలు తప్పవు. వీరు ఏ పనిలోనైనా నిరాశకే గురి అవుతారు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా ఉద్యోగస్తులకు పని భారం అధికం అవుతుంది. కష్టానికి తగిన గుర్తింపు ఉండకపోవడంతో నిరాశకు గురి అవుతారు. వ్యాపారస్తులు అనేక నష్టాలు చవిచూస్తారు.



