- Telugu News Photo Gallery Sports photos Paris Olympics 2024 India's Neeraj Chopra and Pakistan's Arshad Nadeem qualify for javelin final to be held on August 8th
Paris Olympics: జావెలీన్ త్రో ఫైనల్‌లో భారత్ vs పాక్.. నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ పోరు ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Neeraj Chopra vs Arshad Nadeem: పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేసి జావెలిన్ త్రో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్ రౌండ్‌లో అత్యధిక స్కోరు సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించాడు.
Updated on: Aug 06, 2024 | 5:03 PM

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేసి జావెలిన్ త్రో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్ రౌండ్‌లో అత్యధిక స్కోరు సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఏ భారతీయ జావెలిన్ త్రోయర్‌కైనా ఇదే అత్యుత్తమ స్కోరుగా నిలిచింది.

నీరజ్ చోప్రా 89.34 మీటర్ల త్రోతో ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ త్రోతో అతను తన కెరీర్ బెస్ట్ త్రోకు చాలా చేరువయ్యాడు. నీరజ్ అత్యుత్తమ త్రో 89.94 మీటర్లు. పారిస్ ఒలింపిక్స్‌లో అతను ప్రదర్శించిన తీరు చూస్తుంటే ఫైనల్‌లో అతను 90 మీటర్ల అడ్డంకిని దాటడం ఖాయమని తెలుస్తోంది.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి వరుసగా రెండో స్వర్ణం సాధించే అవకాశం ఉంది. ఇలా చేస్తే ఒలింపిక్స్‌లో భారత్ నుంచి రెండు బంగారు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా నిలుస్తాడు. అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్‌లో రెండో పతకం సాధించిన తొలి భారతీయుడిగా కూడా గుర్తింపు పొందాడు.

నీరజ్ చోప్రా మాత్రమే కాదు, పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ కూడా పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అద్భుతంగా రాణించాడు. అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 86.59 మీటర్లు విసిరి ఫైనల్‌కు చేరుకున్నాడు.

ఇప్పుడు ఆగస్టు 8న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌లకు చెందిన ఈ ఇద్దరు అథ్లెట్లు తలపడనున్నారు.




