- Telugu News Photo Gallery Sports photos Indian cricketer zaheer khan wife is bollywood actress sagarika ghatge know about zaheer khan love story marriage with sagarika ghatge
జహీర్-సాగిరకల ప్రేమ.. పెళ్లి వెనుక చాలా ఉంది.. వీరి ప్రేమ ఎలా చిగురించిందో మీకు తెలుసా…!
Zaheer Khan Love Story: క్రికటర్లు బాలీవుడ్ నటీమణుల ప్రేమాయణం మన దేశంలో సర్వసాధారణం అయిపోయింది. జహీర్-సాగిరకలకు ఎక్కడ, ఎలా పరిచయం అయ్యిందో తెలియదనేది ఓ పెద్ద రహస్యం.. అయితే ఆ తర్వాత వీరి ప్రేమ వివాహంగా మారింది.
Sanjay Kasula | Edited By: Ravi Kiran
Updated on: Jun 18, 2021 | 4:24 PM

భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడు. టీమిండియా చాలా విజయాల వెనుక జహీర్ కృషి ఉంది. అతను క్రికెట్ మైదానంలో ఎంత విజయవంతమయ్యాడో... తాను ప్రేమ పిచ్‌లో మరింత విజయవంతమయ్యాడు. అతని భార్య బాలీవుడ్ నటి... అంతేకాదు ఓ రాజకురి కూడా. ఆమె పేరు సాగరిక ఘట్గే. చక్ దే ఇండియాలో ప్రీతి సబర్వాల్ పాత్ర నుంచి చాలా గుర్తింపు పొందారు.

జహీర్ ఖాన్, సాగరికల ప్రేమ ఓ పార్టీలో చిగురించింది. ఇక్కడ ఈ ఇద్దిరి మధ్య నిర్ణయం కూడా కుదిరింది. ఆ తరువాత ప్రేమ సిరీస్ ముందుకు సాగింది. చాలాకాలంగా ఇద్దరూ రహస్యంగా కలుసుకున్నారు. కాని యువరాజ్ సింగ్ వివాహంలో ఇద్దరూ కలిసి వచ్చారు. అప్పుడు మీడియాకు వీరి ప్రేమ కథ తెలిసింది.

చక్ దే ఇండియాలో హాకీ ప్లేయర్ పాత్రలో నటించిన సాగరిక... జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి. ఆమె ఫియర్ ఫాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడిలో తన నటనతో మెప్పించింది. ఇంతే కాకుండా ఓ వెబ్‌సేరీస్ బాస్‌లో కూడా పాల్గొన్నారు.

యువరాజ్ సింగ్ వివాహానికి జహీర్, సాగరికలు కలిసి రావడంతో మీడియా దృష్టి వీరిపై పడింది. మొదట వీరి మధ్య ఉన్న బంధాన్ని అంగీకరించకపోయినా.. తర్వాత జహీర్ ట్విట్టర్ వేదికగా..వారి ఇద్దరి ప్రేమను అభిమానులకు తెలియజేశారు. అప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కింది.

సాగరిక కొల్లాపూర్‌లో జన్మించారు. ఆమె తండ్రి పేరు విజయ్ సింగ్ ఘట్గే. సాగరిక ఒక రాజ కుటుంబానికి చెందినదన యువరాణి. ఈ సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సాగరిక అమ్మమ్మ సీతరాజే ఘట్గే ఇండోర్‌కు చెందిన మహారాజా తుకోజిరావ్ హోల్కర్ మూడవ కుమార్తె.





























